అందాలతో అమీషా...ఎక్కిస్తుంది నిషా..!(ఫోటోలు)

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ బద్రి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం
అయిన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్....తొలి సినిమాతోనే హిట్ కొట్టింది. ఆ
సినిమాలో అమీషా అందంగా, అమాయకంగా చేసిన సరయూ పాత్రకు మంచి మార్కులే
పడ్డాయి. అమీషాపటేల్ అంటేనే గ్లామర్‌కు పర్యాయ పదంగా నిలిచిన అనేక చిత్రాలు
మనకు తెలుసు.
కేవలం తన చూపులతో....ఒంపుసొంపులతో ప్రేక్షకులకు నిషా ఎక్కించగల అందం ఆమెది.
మంచి నటిగా ప్రేక్షకుల మన్నన లు పొందినా, బాలీవుడ్‌లో మంచి మంచి అవకాశాలు
వచ్చినా అమీషాకెందుకో కలిసిరావడంలేదు.
బాలీవుడ్ లోనూ అమీషా పటేల్ ఓ మోస్తరు
హీరోయిన్ గానే రాణించింది.
2009, 2010 సంవత్సరాల్లో అసలు సినిమాలే చేయని అమీషాకి తర్వాత తెలుగులో పరమ
వీర చక్ర, మరో హిందీ సినిమా అవకాశం వచ్చినా పెద్దగా లాభం లేక పోయింది.
ప్రస్తుతం అమీషా నటిస్తున్నా సినిమాల వివరాలు స్లైడ్ షోలో...
అమీషా పటేల్
ప్రస్తుతం ఆమె రన్ బోలా రన్, భయ్యాజీ సూపర్ హిట్, దేశి మ్యూజిక్ సినిమాల్లో
నటిస్తోంది. అయితే ఈ సినిమాల్లో ఆమె హీరోయిన్ రేంజికంటే తక్కువ ఉన్న
సినిమాలే చేస్తోంది.
రూమర్స్
ఇతర వివరాల్లోకి వెళితే...అమీషా పటేల్, బాలీవుడ్ దర్శకుడు విక్రమ భట్ మధ్య ఆ
మధ్య రంజైన ప్రేమాయనం సాగిన విషయం తెలిసిందే. కొంత కాలం పాటు ఇద్దరూ ఒకే
ఇంట్లో సహజీవనం చేసారు. ఆ మధ్య వారిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే
వార్త ప్రబలంగా ప్రచారంలోకి వచ్చింది.
స్నేహం
అయితే విక్రమ్ భట్ మాత్రం ఈవార్తను ఖండించారు. మేము ప్రేమించుకున్నట్లు
వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఆమె గతంలో వాళ్ల పేరెంట్స్‌తో సమస్యలు
ఎదుర్కొన్నప్పుడు నన్నొక మంచి స్నేహితుడిగా భావించి నా వద్ద ఆశ్రయం
పొందింది. కష్టాల్లో ఉన్న ఆమెకు ఓదార్పును మాత్రమే పంచాను. అంతుకు మించి తమ
మధ్య ఎలాంటి బంధం లేదని తేల్చి చెప్పాడు.

తొలి చిత్రం
హిందీలో హృతిక్ రోషన్‌తో కహోనా ప్యార్ హై చిత్రంతో అమీషా సినీ రంగం ప్రవేశం
చేసింది. ఈచిత్రం బాలీవుడ్లో పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాతో హృతిక్
స్టార్ హీరో అయ్యాడు...కానీ అమీషా స్టార్ హీరోయిన్ కాలేక పోయింది.
బద్రి
అమీషా చేసిన రెండో సినిమా తెలుగులో పవన్ తో చేసిన బద్రి. ఈచిత్రం తెలుగులో
భారీ విజయం సాధించింది. అయితే అమీషాకు మాత్రం అవకాశాల పరంగా కలిసి రాలేదు.

తెలుగులో
బద్రి తర్వాత అమీషా పటేల్ తెలుగులో మహేష్ తో నాని, జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహుడు, ఆ మధ్య బాలకృష్ణ తో పరమవీర చక్ర లోనూ నటించింది.

కాలం కలిసి రాలేదు
మంచి నటిగా ప్రేక్షకుల మన్నన లు పొందినా, బాలీవుడ్‌లో మంచి మంచి అవకాశాలు వచ్చినా అమీషాకెందుకో కలిసిరాలేదు.
కెరీర్
37 ఏళ్ల వయసున్నఅమీషా ప్రస్తుతం తన దృష్టంతా సినిమా కెరీర్ తోపాటు, డబ్బు
సంపాదించడంపైనే పెట్టింది. ఈ వయసులో హీరోయిన్ అవకాశాలు కష్టమేకాబట్టి
సినిమాల్లో నటించే ఏ అవకాశం వచ్చినా నో అనకుండా ఒప్పేసుకుంటోంది.
0 comments:
Post a Comment