తమ సొంత గూటి నుంచి విడుదలైన ఆన్‌లైన్ మెసేజింగ్ అప్లికేషన్
చాట్‌ఆన్(ChatON) ప్రపంచవ్యాప్తంగా 10కోట్ల మందికి చేరువైనట్లు సామ్‌సంగ్
వెల్లడించింది. ఈ యాప్‌ను అత్యధికంగా వినియోగించుకంటున్న వారిలో చైనా,
ఇండియాఇంకా యూఎస్ఏ దేశాలకు చెందిన యూజర్లు అధికంగా ఉన్నారు. చాట్‌ఆన్
అప్లికేషన్‌ను అక్టోబర్ 2011లో విడుదల చేసారు. మరో ఆన్‌లైన్ మెసేజింగ్
అప్లికేషన్ వాట్స్‌యాప్ (WhatsApp) 30 కోట్ల మంది యూజర్లతో దూసుకుపోతుంది.
10 కోట్ల మందికి చేరువైన సామ్‌సంగ్ చాట్‌ఆన్ మెసేజింగ్ అప్లికేషన్!
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన
ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్
చేయండి.
సామ్‌సంగ్ చాట్‌ఆన్ అప్లికేషన్ ఆండ్రాయిడ్, బడా, ద వెబ్, విండోస్ ఫోన్,
యాపిల్ ఐఓఎస్,రిమ్ బ్లాక్‌బెర్రీ వంటి ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ
అప్లికేషన్‌ను వ్యక్తిగత కంప్యూటర్‌లోనూ యాక్సిస్ చేసుకోవచ్చు. సామ్‌సంగ్
చాట్‌ఆన్ అప్లికేషన్ ప్రస్తుతానికి 237 దేశాల్లో లభ్యమవుతోంది. ఈ యాప్ 63
భాషలను సపోర్ట్ చేస్తుంది. ఇండియాలో అన్‌లైన్ సంభాషణలకు అనువైన 5
అత్యుత్తమ ఆన్‌లైన్ మెసెంజర్ అప్లికేషన్‌ల వివరాలను మీకు పరిచయం
చేస్తున్నాం.......
వాట్స్‌యాప్ (WhatsApp): ఈ ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌ను
ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ చేయటం జరిగింది. ఈ అప్లికేషన్
ద్వారా వాయిస్, వీడియో ఇంకా ఫోటోలను మీ భాగస్వామి లేదా మిత్రులకు
పంపుకోవచ్చు. ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, సింబియాన్ ఇంకా విండోస్ ఫోన్
యూజర్లు ఈ అప్లికేషన్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
డౌన్‌లోడ్ లింక్
అడ్రస్:
వైబర్ (Viber): ఈ ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌ను స్మార్ట్‌ఫోన్‌ల
కోసం డిజైన్ చేయటం జరిగింది. ఈ అప్లికేషన్ ద్వారా వాయిస్, వీడియో ఇంకా
ఫోటోలను ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా పంపుకోవచ్చు. యాపిల్ ఐవోఎస్, ఆండ్రాయిడ్,
బ్లాక్‌బెర్రీ ఇంకా విండోస్ ఫోన్యూజర్లకు ఈ అప్లికేషన్ అందుబాటులో ఉంది.
డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:
బ్లాక్‌బెర్రీ మెసెంజర్ (BlackBerry Messenger): ఈ అప్లికేషన్‌ను
ప్రత్యేకించి బ్లాక్‌బెర్రీ యూజర్ల కోసం డిజైన్ చేయటం జరిగింది. ఈ
అప్లికేషన్ ద్వారా బ్లాక్‌బెర్రీ 10 యూజర్లు వీడియో కాల్స్
నిర్వహించుకోవచ్చు. ఈ అప్లికేషన్ త్వరలోనే ఆండ్రాయిడ్ ఇంకా ఐవోఎస్
ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేయనుంది.
డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:
గ్రూప్‌మీ(GroupMe): ఈ మొబైల్ గ్రూప్ మెసేజింగ్ అప్లికేషన్‌ను మైక్రోసాఫ్ట్
నిర్వహిస్తుంది. ఈ క్లీన్ ఇంటర్‌ఫేస్ ద్వారా ఫోటోలను ఇన్స్టంట్‌గా షేర్
చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, విండోస్ ఇంకా ఐవోఎస్
ప్లాట్‌ఫామ్‌లకు ఈ అప్లికేషన్ ఉచితంగా అందుబాటులో ఉంది. డౌన్‌లోడ్ లింక్
అడ్రస్:
0 comments:
Post a Comment