హైదరాబాద్: ఇప్పటి వరకు మదర్స్ డే చూసాం, ఫాదర్స్ డే చూసాం,
చిల్డ్రన్స్ డే చూసాం, లవర్స్ డే చూసాం, ఉమన్స్ డే చూసాం. కానీ త్వరలో మన
రాష్ట్రంలో డే కూడా చూడబోతున్నాం. అదే ‘వరల్డ్ పవనిజం డే'. పవర్ స్టార్
పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఇప్పటికే ‘పవనిజం' పేరుతో హల్ చల్ చేస్తున్న
సంగతి తెలిసిందే.
తాజాగా అభిమాన సంఘాలన్నీ చర్చించుకుని అక్టబర్ 11వ తేదీని ‘వరల్డ్ పవనిజం
డే'గా సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే రోజును ఎందుకు ఎంపిక
చేసారంటే....
పవన్ కళ్యాన్ నిటించిన తొలి సినిమా అక్టోబర్ 11, 1996లొ
విడుదలైంది.
ఈ నేపథ్యంలో ఆ డేట్ ఫిక్స్ చేసారన్నమాట.
పవనిజం గురించి ఆ మధ్య పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.....
‘పవనిజం అంటే అదో
అందమైన అభిమానుల ప్రపంచం. నా అభిమానులు నాకోసం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి
పెద్ద ఫంక్షన్లు చేయనక్కర్లేదు. నన్ను అభిమానించే అభిమానుల ప్రతి ఒక్కరి
కళ్ళలోనూ చెరగని ఆనందాన్ని చూడాలనుకుంటాను. వాళ్ళు సమాజం పట్ల భాద్యత
కలిగిన ఒక పౌరిడిగా తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలనేది మాత్రమే
వారి నుంచి ఆశిస్తున్నానని' ఆయన అన్నారు.
ఫ్యాన్స్ ఫిక్సయ్యారు...‘వరల్డ్ పవనిజం డే’ అక్టోబర్ 11
పవన్ కళ్యాణ్
పవనిజం గురించి ఓ అభిమాని ఇలా రాసాడు...
"పవన్" అంటే ఒక" నిజం" .. కలిపి చదివితే "పవనిజం "
తన నిజమైన వ్యక్తిత్వమే ఇక్కడ ఆదర్శం
తన మానవత్వమే ఇక్కడి మార్గం
మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ...
మన పవనుడి పై ప్రేమ ను చూపిస్తాం
తన ఫొటోస్ పెడతాం..తన గురించి ఏదైనా రాస్తాం
అంటే మన ప్రేమ ఇంతవరకే పరిమితమా ...
ఇంకేం చేయలేమా....
చేయగలం ..
ఆలోచించండి ..
మన ప్రేమ తో సమాజానికి ఏదైనా మంచి చేద్దాం ..
మన ప్రేమకి ఉన్న పవర్ ఏంటో చూపిద్దాం ....
ఒక పూట అన్నం తినకపోతే విలవిల లాడే ప్రాణం మనది..
అలాంటి జీవితాలు ఎన్నో, సమయానికి తిండి లేక ..
తోటి మనుషుల ఆదరణ కరువై ప్రతి క్షణం ప్రాణం కోసం పోరాడుతున్నాయి..
ప్రతి రోజు కంటతడి పెడుతున్నాయి ..
సాయం కోసం ఆశతో ఎదురు చూస్తున్నాయి ...
తప్పు ఎవరిదో తెలియదు కాని ప్రాణాలు పోతున్నాయి ...
తల్లి ప్రేమ దూరమై పసి ప్రాణాలు తల్లడిల్లుతున్నాయి
ఆకలి ని తీర్చుకోవడానికి తప్పుదారులు పడుతున్నాయి
ఎన్నో జీవితాలు ఇలా బలి అవుతున్నాయి ..
ఒక మనిషి బాధ ఇంకొక మనిషే కదా అర్థం చేసుకోగలడు
అందుకే ...
మన ప్రేమ ,అభిమానాలకి నిస్వార్థాన్ని చేరుద్దాం
మానవత్వం అనే దారిలో పయనిద్దాం
అనాధలని, ఆపదలో ఉన్న మనుషులని
మన పవనిజం అనే సమాజంలోకి ఆహ్వానిద్దాం
పవనిజం అనే ఆశ్రయాన్ని కల్పిద్దాం
అనాధే ఇక్కడి తల్లి..అనాధే ఇక్కడి తండ్రి
అనాధలే ఇక్కడి బిడ్డలు ..
రండి బయలుదేరుదాం
అనాధ అంటే "అందరి నేస్తం " అనే అర్థాన్ని తెద్దాం
వారికి ఆత్మీయులుగా ఉందాం..
పవనిజం అంటే పవనుడి అభిమానులకే కాదు
అందరికోసం నిలిచి ఉంటుంది అని నిరూపిద్దాం
మనమే ఇక్కడ హీరోలమౌదాం ...
మన పవనిజం లోని పరమార్థాన్ని లోకానికి తెలియచేద్దాం ...
మీరు సిద్దమేనా...
అయితే ముందుకు రండి ..
మనమేంటో ...
మన పవనిజం లోని ప్రేమకున్న పవర్ ఏంటో
చూపిద్దాం ...
0 comments:
Post a Comment