చూస్తుంటే.. పవర్ స్టార్ ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తున్నాడు. ప్రతోళ్ళు పవన్ కళ్యాణ్ పేరును ఉపయోగించుకుని పాపులర్ అయిపోతున్నారు. అరె... ఈమధ్య కాలంలో పవర్ స్టార్ ను వాడుకోకపోవటం పాపంలా కనిపిస్తుంది. ఎవరికీ తోచినట్టు వాళ్ళు పరి పరి విధములా పవనాందలహరి జపిస్తూ ఎవరికీ కావాల్సింది వాళ్ళు దక్కించుకుంటున్నారు. పరిస్థితిని పరిశీలిస్తుంటే పవనిజం అనే శక్తి రిలీజియన్ అనే మాటను దాటుకుని వేరే ఏదో కొత్త ప్రపంచాన్ని సృష్టించేట్టు కనపడుతుంది.
తానూ నటిస్తున్న చిత్రాలతో నిర్మాతలకు, పరిశ్రమకు మేలు చేయటమే కాదు, కేవలం తన పేరుతోనే చిన్న సినిమాలకు కొత్త ఊపిరి ఇస్తున్నాడు పవన్. నితిన్ నాయకత్వంలో మొదలైనా ఆ ఒరవడిని కుర్ర హీరోలందరూ పద్దతిగానే ఫాలో అవుతున్నారు. సినిమాల వరుకేనా మాకు కూడా పవర్ స్టార్... పవన్ కళ్యాణే కదా అని ఆయన్ని వాడుకోవటానికి కొత్త స్కీములేస్తున్నారు బుల్లితెర బాబులు. ఆ క్రమంలో వచ్చిందే ఈ జబర్దస్త్ పవనిజం. జబర్దస్త్ కామెడీ షో తో గుర్తింపు తెచ్చుకున్న షకలక శంకర్ బాగా పాపులర్ అయిపోవాలనే కోరికతో పవనానుగ్రహం కోసం తపస్సు మొదలుపెట్టాడు. పవర్ స్టార్ ను ప్రసన్నం చేసుకోవటానికి ఓ పాట కట్టి మరీ పాడి తనకున్న పవన్ భక్తిని చాటుకుంటున్నాడు. ఆ ప్రయత్నంతో పవన్ పసన్నత ఏమో కాని ఆయన సోదరుడు నాగబాబు అభినందలు దక్కించుకున్నట్టైతే తెలుస్తుంది.
త్వరలోనే షకలక శంకర్ పవనానుగ్రహ భక్తీ గీతం జబర్దస్త్ ప్రొగ్రామ్ ద్వారా జనాలను చేరనుంది. ఆ తరవాత శంకర్ ఇమేజ్ పూర్తిగా మారిపోవటం ఖాయంగా కనిపిస్తుంది. ఆ రకంగా పవన్ కళ్యాణ్ షకలక శంకర్ ను అనుగ్రహించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
షకలక శంకర్ పవన్ భక్తీ గీతం :
0 comments:
Post a Comment