శివుడు, ముక్కంటీశ్వరుడు, భోళో శంకరుడు, శ్రీ మంజునాథ, ఇలా రకరకాలుగా
కొలుచే శివ భక్తులు భారతదేశంలో అన్నివైపులా ఉన్నారు. ఉత్తర భారతదేశం
మొదలకుని దక్షిణ భారతదేశంలో మొదలకుని శివుని యొక్క అనేక దేవాలయాలు ఉన్నాయి.
ప్రతి ఊరిలోని శివుడు కొలువై ఉన్నాడు.
అతి పెద్ద దేవాలయాలు మాత్రమే కాదు
కనీసి చిన్న గుడిఅయినా సరి శివుడు కొలువుదీరి ఉన్నాడు.
శివుని నమ్మిన వారు, పూజించు భక్తులకు కష్టకాలంలో తప్పక ఆదుకొంటాడనే నమ్మకం
శివ భక్తుల్లో ఆనాటి నుండి ఈ నాటి వరకూ ఓ నమ్మకం ఉంది. దేశంలో చాలా వరకూ
శివుని యొక్క దేవాలయాలు అత్యంత ప్రసిద్ది చెంది ఉన్నాయి. మరి ఆ ప్రసిద్ద
వేవాలయాలను ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక సారి చూడ్డండి...
వారణాసిలోని కాశీవిశ్వనాథ దేవాలయం: కాశీ లేదా వారాణసి (Kasi, Benaras,
Varanasi) భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత
పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ద్వాదశ
జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ శివుడు కాశీ విశ్వేశ్వరుడుగా
పూజలందుకుంటున్నాడు. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు
నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే
రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి
వారాణసి (వారణాసి అని అంటుంటారు) అని కూడా నామాంతరం కలదు. బ్రిటిషువారి
వాడుకలో వారణాసి, బెనారస్ అయింది.
దరనాథ్: కేదార్‌నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి.ఇది భారత
దేశాంలోని ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా లోని ఒక నగర పంచాయితీ.
కేదార్‌నాథ్ సముద్రమట్టానికి 3584మీటర్ల ఎత్తులో ఉంది.మందాకినీ నది
పైభాగంలో మంచు కప్పిన కోడల మద్య ఉంది.హిందువుల పవిత్ర ఆలయమైన కేదార్‌నాథ్
శివాలయం ఉన్న పుణ్య క్షేత్రం.శివభక్తుల ముఖ్య పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్.
సోమనాథ్ దేవాలయం: సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రాలోని
వెరావల్‌లో ఉన్న హిందూ పుణ్య క్షేత్రము. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో
సోమనాథ్ మొదటిది. దీనిని "ప్రభాస తీర్థం" అని కూడా పిలుస్తారు. స్థల
పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు.
సోముడు అనగా చంద్రుడు అని అర్ధం. చంద్రుడిని దక్షుడి శాం నుండి
విముక్తిడిని చేసిన శివుడి ఆలయం కనిక ఇది సోమనాధ ఆలయం ఇక్కడి శివుడు
సోమనాధుడు అయ్యాడు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపః ఫలంగా స్వయంగా
ప్రత్యక్షమై స్వయంగా వెలిసాడు.
అమరనాథ్ దేవాలయం: హిందూ వినాశన దైవం (లయకారుడు) అయిన మహా శివుని
భక్తులు అమర్ నాథ్ యాత్రకు పూనుకుంటారు. ఈ యాత్రను జమ్మూ కాశ్మీర్
ప్రభుత్వం 5వ హిందూ మాసం అయిన శ్రావణం లోనిర్వహిస్తుంది. అమర్ నాథ్
యాత్రికులు సాధారణంగా కఠినమైన వాతావరణ పరిస్థితులు, ఏటవాలు అధిరోహక బాటలు
లాంటి అనేకానేక బాధలను ఎదుర్కొంటారు.
లింగరాజ దేవాలయం: ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని అతి పెద్ద
దేవాలయం లింగరాజ దేవాలయం. లింగానికి రాజైన శివుని గుడి ఇది. ఇక్కడ శివుణ్ణి
త్రిభువనేశ్వరుడనే పేరుతో పూజిస్తారు. దీనిని 1100 ఏళ్ల క్రితం
నిర్మించారు. దీని ఎత్తు 180 అడుగులు. కళింగుల నిర్మాణశైలికి ఈ కట్టడం
అద్దం పడుతుంది. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానికి కచ్చితమైన ఆధారాలు
లేనప్పటికీ సోమ వంశీయుడయిన కేసరి అనే రాజు 11వ శతాబ్దంలో నిర్మించి ఉంటాడని
భావిస్తున్నారు. చారిత్రక ఆధారాలను బట్టి కేసరి తన రాజధానిని జైపూర్ నుంచి
భువనేశ్వర్‌కి మార్చినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయం నాల్గు భాగాలుగా
ఉంటుంది. వీటిలో ప్రధాన ఆలయం, యజ్ఞశాల, భోగ మండపం, నాట్యశాలలు ఉంటాయి.
మురుడేశ్వర: మురుడేశ్వర. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా
లోని భట్కల్ తాలుకా లోని ఒక పట్టణం. ఈ పట్టణం శివుని పుణ్యక్షేత్రం. ఈ
పట్టణం అరేబియా సముద్రం ఒడ్డున ఉన్నది. ఈ పట్టణం లో ప్రపంచంలోనే అతి పొడవైన
శివుని విగ్రహం ఉన్నది.ఈ పట్టణం లో ఉన్న శివాలయం లో ఉన్న ప్రధాన దైవం
శివుడు మురుడేశ్వరుడు గా అర్చింపబడుతున్నాడు.
మల్లికార్జునుడు - శ్రీశైలము, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ - ఇక్కడ
కృష్ణానది పాతాళగంగగా వర్ణింపబడినది. ఈ క్షేత్రము అష్టాదశ శక్తి పీఠములలో
ఒక్కటి. ఆది శంకరాచార్యుడు శివానందలహరిని ఇక్కడే వ్రాశాడు. ఇక్కడ అమ్మవారు
భ్రమరాంబాదేవి.
మహాకాళ దేవాలయం: మహాకాళుడు - (అవంతి) ఉజ్జయిని, మధ్యప్రదేశ్ -
క్షిప్రానది ఒడ్డున ఉన్నది. ఈ నగరములో 7 సాగర తీర్థములు, 28 తీర్థములు, 84
సిద్ధ లింగములు, 30 శివలింగములు, అష్టభైరవులు, ఏకాదశరుద్రులు, వందలాది
దేవతా మందిరములు, జలకుండము ఉన్నవి.
కేథరనాథేశ్వరుడు: కేదారేశ్వరుడు - హిమాలయాలలో, గర్ వాల్ జిల్లా,
ఉత్తరప్రదేశ్ - మందాకినీ నదీ సమీపంలో- మంచుకారణంగా ఈ దేవాలయం సంవత్సరానికి
ఆరు నెలలు మాత్రమే దర్శనమునకు తెరచి ఉంటుంది.
విశ్వనాథ దేవాలయం: విశ్వనాథుడు - వారణాసి, ఉత్తరప్రదేశ్ - కాశి అని
కూడ ప్రసిద్ధము - వరుణ, అసి నదులు గంగానదిలో కలిసే స్థానము - పరమపావన
తీర్థము - ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణేశ్వరి.
రయంబకేశ్వరుడు: నాసిక్, మహారాష్ట్ర - గౌతమీ తీరమున - ఇక్కడి లింగము
చిన్న గుంటవలె కనిపించును, అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా మూడు
చిన్న (బొటనవేలివంటి) లింగములున్నవి. అమ్మవారు కొల్హాంబిక. గంగాదేవి
మందిరము కూడ ఉన్నది. కుశావర్త తీర్థము, గంగాద్వార తీర్థము, వరాహ తీర్థము
ముఖ్యమైనవి. 12 సంవత్సరములకొకమారు జరిగే సింహస్థపర్వము పెద్ద పండుగ.
రామేశ్వరుడు: రామేశ్వరము, తమిళనాడు - శ్రీరాముడు పరమశివుని అర్చించిన
స్థలము - కాశీ గంగా జలమును రామేశ్వరమునకు తెచ్చి అర్చించిన తరువాత, మరల
రామేశ్వరములోని ఇసుకను కాశీలో కలుపుట సంప్రదాయము. ఇక్కడ అమ్మవారు
పర్వతవర్ధినీ దేవి.
0 comments:
Post a Comment