Wednesday, 2 October 2013

ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ గురించి ట్రైనర్స్ ...

హైదరాబాద్ ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్ సిక్స్ ప్యాక్. సిక్స్ ప్యాక్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కఠోర శ్రమతో కూడుకున్న వ్యవహారం. ఆహారం దగ్గర నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ డైలీ నిపుణుల పర్యవేక్షణలో ఎక్సరసైజులు చేస్తూ నెలల తెరబడి శ్రమించాలి. 
ఇప్పుడు ఎన్టీఆర్ ఈ అరుదైన ఫీట్ ని అతి సునాయసంగా చేసాడంటున్నారు. మొదట నుంచి బొద్దుగా ఉండే ఎన్టీఆర్ కాస్తా... స్లిమ్‌గా మారి ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇవ్వటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. తెలిసిన సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ....
 ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ గురించి ట్రైనర్స్ ...
ప్రస్తుతం ఉన్న తన బరువు కంటే... రెండు రెట్లు బరువును మోయగల శక్తిగా గా మారారు . ఆయన ఇలా శక్తి వంతుడుగా గా మారడం వెనుక అకుంఠిత దీక్ష, పట్టుదల ఉన్నాయంటున్నారు ఆయన పర్సనల్ ఫిజికల్ ట్రైనర్స్ ఎంబర్, జాన్ షుమెట్. వీరిద్దరూ ఎనిమిది నెలల క్రితం తారక్ కోసం ప్రత్యేకంగా అమెరికా నుంచి వచ్చారు. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ గురించి ట్రైనర్స్ ... 
రామయ్యా వస్తావయ్యా గత ఎనిమిది నెలల్లో శారీరకంగా ఎన్టీఆర్ లో ఎన్నో మార్పులొచ్చాయని, తన బరువు కంటే రెండు రెట్లు బరువును ఆయన అవలీలగా మోయగలరని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ శరీరంలో కొవ్వు శాతం పూర్తిగా తగ్గిపోయిందని, కేవలం ఎనిమిది నెలల్లో ఆయన సాధించిన ఘనత ఇదని ఎంబర్, జాన్ షుమెట్ తెలిపారు. ‘రామయ్యా వస్తావయ్యా'లో సిక్స్ ప్యాక్ దేహంతో ఎన్టీఆర్ కనిపించనున్నారని సమాచారం. అదీ క్లైమాక్స్ ఫైట్ లో అని తెలుస్తోంది. అది సర్పైజ్ ఎలిమెంట్ అని చెప్తున్నారు.

0 comments:

Post a Comment