అత్యాధునిక ఆండ్రాయిడ్ మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లతో లెనోవో నుంచి ఇటీవల విడుదలైన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లెనోవో వైబ్ జెడ్ (Lenovo Vibe Z) అనేక మొబైల్ బ్రాండ్‌లకు సవాల్ విసురుతోంది. ప్రయోగశాలలో అనేక కఠినమైన సవాళ్లను ధీటుగా ఎదుర్కొని మార్కెట్లోకి అడుగుపెట్టిన లెనోవో వైబ్ జెడ్ యాపిల్, సామ్‌సంగ్, నోకియా వంటి దిగ్గజాలకు అన్ని విభాగాల్లోనూ ధీటైన జవాబిస్తోంది. అన్ని విభాగాల్లో నాణ్యమైన పనితీరును కనబరుస్తున్న లెనోవో వైబ్ జెడ్ స్పెసిఫికేషన్‌లను ఓ సారి చూద్దాం... హైడెఫినిషన్ సామర్థ్యంతో కూడిన 5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, 401 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్. శక్తివంతమైన క్వాల్కమ్ చిప్‌సెట్, స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్‌కోర్ సాక్ (క్లాక్ వేగం 2.2గిగాహెట్జ్), అడ్రినో 330 గ్రాఫిక్ యూనిట్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా 4128 x 3096 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటితో ( ప్రత్యేకమైన ఫీచర్లు: ఆటో ఫోకస్, ఎఫ్1.8 అపెర్చర్ లెన్స్, ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ( ప్రత్యేకతలు: వైడ్-యాంగిల్ షాట్‌లను చిత్రీకరించుకునేందుకు 84డిగ్రీల లెన్స్ అలానే వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు). కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే: జీపీఆర్ఎస్, స్పీడ్, WLAN,బ్లూటూత్, యూఎస్బీ, 3జీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ. శక్తివంతమైన లై-పో 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఫోన్‌లో అమర్చారు. ఇండియన్ మార్కెట్లో లెనోవో వైబ్ జెడ్ స్మార్ట్‌ఫోన్ 16జీబి మెమెరీ వేరియంట్‌లో లభ్యమవుతుంది. ఫోన్ పరిమాణాన్ని పరిశీలించినట్లయితే 149.1 x 77 x 7.9మిల్లీ మీటర్లు. లెనోవో వైబ్ జెడ్ ధర: ఆవిష్కరణ సమయంలో లెనోవో వైబ్ జెడ్ ధర రూ.35,999. ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా ఈ అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌ను ధర రూ.33,999కు సొంతం చేసుకునే అవకాశాన్ని కంపెనీ ఆన్‌లైన్ స్టోర్ TheDoStore కల్పిస్తోంది. లెనోవో వైబ్ జెడ్ కొనుగోలు పై రూ.2,039 విలువ చేసే వైబ్ జెడ్ బాక్సును సైట్ ఉచితంగా అందిస్తోంది. ప్రత్యేకమైన కెమెరా వ్యవస్థ: ADVERTISEMENT లైనోవో వైబ్ జెడ్ స్మార్ట్‌ఫోన్ వెనుకా ఇంకా ముందు భాగాల్లో ఏర్పాటు చేసిన కెమెరా వ్యవస్థ వినియోగదారులకు ప్రత్యేకమైన అనుభూతులను చేరువచేస్తాయి. ఫోన్ వెనుకభాగంలో అమర్చిన 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా ద్వారా 4128 x 3096 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటితో కూడన ఫోటోలను చిత్రీకరించుకోవచ్చు. ఆటో ఫోకస్, ఎఫ్1.8 అపెర్చర్ లెన్స్, ఎల్ఈడి ఫ్లాష్ వంటి ప్రత్యేకమైన సదుపాయాలను ఈ కెమెరా వ్యవస్థలో నిక్షిప్తం చేసారు. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ద్వారా 84డిగ్రీల లెన్స్‌తో కూడిన వైడ్-యాంగిల్ షాట్‌లను చిత్రీకరించుకోవచ్చు. అలానే నాణ్యమైన వీడియో కాలింగ్‌ను ఆస్వాదించువచ్చు. సాధారణ స్మార్ట్‌ఫోన్‌లు అందిస్తోన్న కెమెరా క్వాలిటీతో పోలిస్తే లెనోవో వైబ్ జెడ్ 33శాతం అత్యధిక క్వాలిటీతో కెమెరా క్వాలిటీని తమ వినియోగదారులకు ఆఫర్ చేస్తోంది. లెనోవో వైబ్ జెడ్ కెమెరా క్వాలిటీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...
కాంట్రాస్ట్ ఇంకా లైట్ డిటెక్షన్
కాంట్రాస్ట్ ఇంకా లైట్ డిటెక్షన్
లెనోవో వైబ్ జెడ్‌లో ఏర్పాటు చేసిన కెమెరా వ్యవస్థ ఫోటోలను చిత్రీకరించే
సమయంలో మీ అంచనాలకు తగ్గట్లుగా తన విధులను నిర్వహిస్తుంది. కెమెరాలో
నిక్షిప్తం చేసిన ఫిల్టర్‌లతో పాటు వివిధ మోడ్‌లు ఫోటోలను చూడచక్కని రీతిలో
అద్భుతంగా మలుస్తాయి.
బడ్జెట్ ప్రెండ్లీ ధరల్లో ఏ ఫోన్ కెమెరా ఇవ్వలేనంత క్వాలిటీ
బడ్జెట్ ప్రెండ్లీ ధరల్లో ఏ ఫోన్ కెమెరా ఇవ్వలేనంత క్వాలిటీ
లెనోవో వైబ్ జెడ్‌లో ఏర్పాటు చేసిన కెమెరా వ్యవస్థ అదే ధరల్లో లభ్యమవుతున్న
ఏ ఫోన్ కెమెరా ఇవ్వలేనంత నాణ్యమైన ఫోటోగ్రఫీని మీకు చేరువచేస్తుంది. ఈ
ఫోన్ ద్వారా మీరు క్లోజప్ లేదా మాక్రో షాట్‌లను చిత్రీకరించే ఇతర ఫోన్‌ల
ద్వారా చిత్రీకరించిన ఫోటోలతో విశ్లేషించి చూసినట్లయితే ఫలితం మీకే
అర్థమవుతుంది.
0 comments:
Post a Comment