Monday 30 September 2013

రాష్ట్రపతి పాలనకు రంగం సిద్దం ? అక్టోబర్ 6 నుంచి అమలు ..!

హైదరాబాద్(న్యూస్ టీవీ): రాష్ట్రం లో రాష్ట్రపతి పాలనకు రంగం సిద్దమైంది . ఈ మేరకు గవర్నర్ నరసింహన్ నోట్ తయారు చేయడం ,కేంద్రానికి పంపించడం కూడా పూర్తయినట్టు కొద్దిసేపటి క్రితం రాజ్ భవన్ లో కొన్ని విశ్వసనీయ వర్గాలు `న్యూస్ టీవీ 'కి సమాచారం ఇచ్చాయి . ఇప్పుడున్న సమాచారం ప్రకారం వచ్చే అక్టోబర్ 6 నుంచి రాష్ట్రపతి పాలన ఉండవచ్చని చెబుతున్నారు . సీఎమ్ కిరణ్ కు కాంగ్రెస్ అధిష్టానం తో విభేదాలు తీవ్రంగా ముదిరిన నేపథ్యం లో ఇక తప్పని పరిస్థితుల్లో రాష్ట్రం లో వెంటనే రాష్ట్రపతి పాలన కు కేంద్రం సిద్దమైనట్టు రాజ్ భవన్ వర్గాల కథనం .

దీనిలో భాగంగానే దిగ్విజయ్ సింగ్ నుంచి ఈరోజు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు ఫోన్ కాల్ వచ్చింది . వెంటనే డిల్లీ రావాలని ఆదేశించారు . కొద్ది రోజుల్లో తెలంగాణా నోట్ ను కేంద్ర హోం శాఖ ప్రకటిస్తున్న నేపథ్యం లో `రాష్ట్ర పతి పాలన' విషయం వెలుగులోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది .
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా అడుగులేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఉంది . తెలంగాణా ప్రక్రియను రాజ్యాంగ పరిధిలో పూర్తి చేయాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీ లో సాధ్యం కాధు. మెజారిటీ సభ్యులు సీమాంధ్ర వాళ్ళు ఉండడమే కారణం . వీరికి తోడు ఎమైఎమ్ కూడా . అందుకే రాష్ట్రం లో అసెంబ్లీని లేకుండా చేసి వెంటనే గవర్నర్ సిఫార్సుల మేరకు తెలంగాణా తతంగం పూర్తిచేయాలని ప్రణాలికలు సిద్దం చేసినట్టు తెలుస్తోంది .

0 comments:

Post a Comment