Monday 30 September 2013

రొమాంటిక్ ఫిజిక్ కాబట్టే...: కేథరిన్‌ (హాట్ ఫోటో ఫీచర్)

రొమాంటిక్ ఫిజిక్ కాబట్టే...: కేథరిన్‌ (హాట్ ఫోటో ఫీచర్)  

హైదరాబాద్: ‘ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో ఓ అమ్మాయిగా నటించిన కేథరిన్‌ అసలు పేరు కేథరిన్‌ ట్రెసా అలెగ్జాండర్‌. 2010 లోనే కెరీర్‌ ఆరంభించిన ఈ కేరళ కుట్టి... ఈ ఏడాది ప్రథమార్ధంలో వరుణ్‌సందేశ్‌తో కలిసి ‘చమ్మక్‌ చల్లో' అంటూ తెలుగు తెరపై తళుక్కున మెరిసింది. 
తన అందచందాలతో ఇట్టే ఆకట్టుకున్న ఈ జవ్వనికి ఆ సినిమా రిలీజ్‌ అవ్వడం ఆలస్యం రెండు భారీ ఆఫర్లు మూటగట్టుకుని తెలుగు ప్రేక్షకులను తన హాట్‌ అందాలతో కవ్వించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఒకే ఒ తెలుగు సినిమాలో నటించిన తారకు ఒకేసారి రెండు భారీ చిత్రాలలో అవకాశాలు లభించడమంటే అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది.
 బన్నీతో కలిసి పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘ఇద్దరమ్మాయిలతో' చిత్రంలోనూ, నాని హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పైసా' చిత్రంలోనూ, చిత్రంలో నాయిక గా నటించిన కేథరిన్‌ పంట పండిందని అంటు న్నారు.
 కన్నడ, మలయాళంలో పలు చిత్రాల్లో నటించినప్పటికి ఇంతకుముందు కేవలం ఒకే ఒక చిత్రం (వరుణ్‌సందేశ్‌ సరసన ‘చమ్మక్‌ చల్లో') లో నటించింది.‘ఇద్దరమ్మాయిలతో' సినిమాలో బన్నీతో కలిసి కేథరిన్‌ ‘టాపు లేచిపోద్ది' పాటలో హాట్‌ హాట్‌గా నటించి అందరి దృష్టిలో పడింది.
 ఇప్పటికే సినివర్గాల్లో చర్చ మొదలయ్యింది. తొలుత కన్న డ, ఆ తరువాత మలయాళం, ఇప్పుడు తెలుగు సినిమాలో వన్‌ బై వన్‌ అరంగేట్రం చేసుకుంటూ పోతున్న అందాల తార కేథరిన్‌ తన మనస్సులో మాటలను మీడియా ముందు బయిటపెట్టింది.

దుబాయిలోనే ....
 నేను పుట్టింది కేరళలోని కొట్టాయంలో. నాన్న వ్యాపారరీత్యా నా చిన్నప్పుడే దుబాయ్‌ వెళ్లిపోయాం. ప్లస్‌టూ వరకూ దుబాయ్‌లోనే ఉన్నా. డిగ్రీ చదవడానికి బెంగళూరులో అడుగుపెట్టా. అక్కడ సెయింట్‌ జోసెఫ్‌ కాలేజీలో చదువుతూనే మోడలింగ్‌లో నా అదృష్టాన్ని పరీక్షించుకుందామని నా ఫొటోలు కొన్ని ప్రకటనల కంపెనీలకు పంపించాను.


 

రకటనలతో గుర్తింపు... 
 నా ఫొటోల్ని ప్రముఖ ఫ్యాషన్‌ గురు ప్రసాద్‌ బిద్దప్ప చూసి ఆయన నిర్వహించే ఫ్యాషన్‌ షోలలో అవకాశమిచ్చారు. అలా మోడలింగ్‌లో అడుగుపెట్టా. తర్వాత్తర్వాత ఫ్యాషన్‌ షోలతోపాటు ప్రకటనలూ చేసే అవకాశం వచ్చింది. నల్లి సిల్క్స్‌, చెన్నై సిల్క్స్‌, ఫాస్ట్‌ట్రాక్‌, జోస్కో జ్యువెలరీస్‌, డెక్కన్‌ క్రానికల్‌కు మోడలింగ్‌ చేశాను. ఫాస్ట్‌ట్రాక్‌ ప్రకటనతో మంచి గుర్తింపు వచ్చింది.
నాన్నికి ఇష్టం లేదు... 
నిజానికి నేను సినిమాల్లోకి వెళ్లడం నాన్నకు ఇష్టం లేదు. నేను సక్సెస్ కాలేనని ఆయన అనుమానం. కానీ ఇప్పుడు మాత్రం నాన్న చాలా హ్యాపీ. వరుసగా పెద్ద పెద్ద ఆఫర్లు వస్తుంటే... చెప్పలేనంత అనందంగా ఉంది
మొదటి సినిమాలు మోడలింగ్‌లోనూ విజయం సాధించిన తర్వాత సినిమా అవకాశం వచ్చింది. అందులోనూ నన్ను పరీక్షించుకుందామని ఓకే చెప్పానుతప్ప చిన్నప్పటి నుంచే నాకు సినిమా కలలు లేవు. కన్నడలో 'శంకర్‌ ఐపీఎస్‌' నా మొదటి సినిమా. తర్వాత మలయాళంలో 'థ్రిల్లర్‌', 'ఉప్పుకుందం బ్రదర్స్‌' సినిమాలు చేశాను. తర్వాత కన్నడ సూపర్‌స్టార్‌ ఉపేంద్రతో 'గాడ్‌ఫాదర్‌' సినిమా చేశాను.
జస్ట్ మిస్...
 కన్నడ, మలయాళ సినిమాల్లో రెండేళ్లు చాలా ఓపిగ్గా పనిచేశాను. చాలా విషయాలు నేర్చుకున్నాను. మమ్ముట్టితో ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ చిన్న పిల్లలా కనిపిస్తున్నానని వద్దన్నారు. తెలుగులో నా మొదటి సినిమా 'ప్రేమ కావాలి' కావాల్సింది. మొదట ఒప్పందం కుదిరినా తర్వాత రద్దుచేసుకోవాల్సి వచ్చింది. తర్వాత 'చమ్మక్‌ చల్లో'లో అవకాశం వచ్చింది. దానిలో నాది పెద్ద పాత్ర కాదు. కానీ నటనకు అవకాశం ఉన్న పాత్రని చేశాను.

 
'ఇద్దరమ్మాయిలతో' లోకి అలా.... 
 'చమ్మక్‌ చల్లో' సినిమా విడుదల కాకముందే తెలుగులో 'ఇద్దరమ్మాయిలతో', 'పైసా'లో అవకాశం వచ్చింది. పైసాలో నాది ముస్లిం అమ్మాయి పాత్ర. కళ్లతోనే మాట్లాడుతుంది. ఆ పాత్ర చాలా కష్టం. నా ప్రతిభకు పరీక్ష అనుకొని చేశాను. నాకు బాగా గుర్తింపు వచ్చింది మాత్రం 'ఇద్దరమ్మాయిలతో'నే. తెలుగులో ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే మూడూ ఒకేసారి షూటింగ్‌లు జరిగాయి.







0 comments:

Post a Comment