Wednesday 2 October 2013

ఎగ్ దమ్ బిర్యానీ రిసిపి: అద్భుత టేస్ట్

బిర్యానీ రిసిపి అంటే నాన్ వెజిటేరియన్స్ కు బాగా తెలుసు. ఉడికించిన గుడ్లు సాధారణంగా చికెన్ బిర్యానీ లేదా మటన్ బిర్యానీలో ఒక భాగం. అయితే మీరు ఎగిటేరియన్ అయితే, ఈ ఎగ్ దమ్ బిర్యానీని ట్రై చేయవచ్చు. ఈ బిర్యానీ ఉడికించిన గుడ్లతో తయారుచేస్తారు. 
 నిజానికి ఎగ్ దమ్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ రిసిపి. ఈ దమ్ బిర్యానీని దమ్ పక్త్ స్టైల్లో తయారుచేయబడింది .
 ఈ ఇండియన్ రైస్ రిసిపి చాలా స్పెషల్ . ఎందుకంటే దీన్ని లేయర్స్ గా తయారుచేస్తారు. ఈ ఎగ్ దమ్ బిర్యానీ రుచి మీరు చూడాలంటే ఈ క్రింది తయారీ పద్దతిని ఫాలో అవ్వాల్సిందే...
 ఎగ్ దమ్ బిర్యానీ రిసిపి: అద్భుత టేస్ట్
కావల్సిన పదార్థాలు: గుడ్లు: 6 అన్నం తయారీకి: రైస్: 1/2cup చికెన్ స్టాక్: 3cup లవంగాలు: 4 చెక్క: చిన్న ముక్క బ్లాక్ కార్డమమ్(యాలకులు): 3 బ్లాక్ పెప్పర్: 4-6 బిర్యాని ఆకు: 1 నిమ్మరసం: 2tbsp ఉప్పు: రుచికి సరిపడా నెయ్యి: 1tbsp మసాలా కోసం: నెయ్యి: 4tbsp ఉల్లిపాయలు: 2 సన్నగా కట్ చేసుకోవాలి అల్లం, వెల్లుల్లి పేస్ట్: 3tsp టమోటో: 3(సన్నగా తరిగి పెట్టుకోవాలి) కొత్తిమీర తరుగు : 1/4cup కారం: 1/2tsp పసుపు: 1/2tsp గరం మసాలా: 1/2tsp పెరుగు: 1/2 cup నిమ్మరసం: 2tsp లేయర్ గా పరచడానికి గార్నిషింగ్ కోసం: ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేసుకోవాలి) నెయ్యి: 2tbsp జీడిపప్పు: 1/4cup ఎండు ద్రాక్ష: 1/4cup కుంకుమపువ్వు: చిటికెడు పాలు: 2tbps తయారుచేయు విధానం: 1. ముందుగా ఒక బౌల్లో నీళ్ళు పోసి, అందులో గుడ్లు వేసి ఉడికించుకొని, పొట్టుతీసి, ఉడికిన గుడ్లను కట్ చేసి పెట్టుకోవాలి. గార్నిష్ కోసం: 1. ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ లో వేగించుకోవాలి. 2. అదే పాన్ లో జీడిపప్పు మరియు ద్రాక్షవేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి. 3. అలాగే గోరువెచ్చని పాలలో కుంకుమపువ్వు వేసి పక్కన పెట్టుకోవాలి. మసాలా: 1. మందపాటి పాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి, కాగనివ్వాలి. 2. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి పింక్ కలర్ లోకి మారేంతవరకూ వేగించుకోవాలి. 3. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 5నిముషాలు మీడియం మంట మీద వేగించాలి. 4. తర్వాత మిగిలిన పదర్థాలు కూడా వేసి కొద్దిసేపు వేగించుకోవాలి. 5. ఇప్పుడు అందులో ఉడికించి పెట్టుకొన్నగుడ్డు కూడా వేసి 5నిముషాలు వేగించుకోవాలి. అన్నం: 1. బియ్యంను శుభ్రం చేసి 15నిముషాలు నానబెట్టుకోవాలి. 2. తర్వాత పాన్ లో నెయ్యి వేసి, వేడయ్యాక అందులో మసాలా దినుసులన్నింటినీ వేసి ఒక నిముషం వేగించుకోవాలి. 3. తర్వాత అందులో బియ్యం వేసి ఒక నిముషం వేగించాలి. తర్వాత అందులోనే చికెన్ స్టాక్(చికెన్ ఉడికించిన నీళ్ళు), ఉప్పు, మరియు నిమ్మరసం వేసి, బాగా మిక్స్ చేయాలి. 4. తర్వాత పాన్ మూత పెట్టి, తక్కువ మంట మీద 90శాతం ఉడికించుకోవాలి. లేయరింగ్ కోసం: 1. మందపాటి పాన్ లో సగభాగం గుడ్లు మరియు మసాలా వేసి పాన్ మొత్తం సర్దాలి. 2. దాని మీద ఉడికించి పెట్టుకొన్న అన్నంను పరవాలి. 3. ఇప్పుడు దాని మీద ఫ్రై చేసి పెట్టుకొన్న ఉల్లిపాయలు, జీడిపప్పు, ద్రాక్షను కూడా చిలకరించాలి. 4. మిగిలిన ఎగ్ మసాలా, అన్నం, ఫ్రైయింగ్ పదార్థాలతో మరో సారి లేయర్స్ గా ఒక దాని తర్వాత ఒకటి పరవాలి. 5. చివరగా కుంకుమపువ్వు నానబెట్టుకొన్న పాలను పోయాలి. ఇప్పుడు అల్యూమినియం ఫోయిల్ తో పూర్తిగా కవర్ చేయాలి. ఆవిరి మీద 10-15నిముషాలపాటు చాలా తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అంతే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ రైతాతో వేడి వేడిగా సర్వ్ చేయాలి . ఇందులో కుంకుమపువ్వు పాలను చిలకరించడం వల్ల అద్భుతమైన టేస్ట్ వస్తుంది.



0 comments:

Post a Comment