Wednesday, 9 October 2013

కలిసుండటమెందుకు అంటున్న వెంకీ..?


 
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రం విజయం తర్వాత వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు. ప్రస్తుతం రామ్ తో కలిసి "మసాలా" చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే వెంకటేష్ మరో మల్టీస్టారర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో వెంకటేష్, రామ్ చరణ్ కలిసి బాబాయ్,కొడుకులుగా నటించబోతున్నారు. ఈ చిత్రానికి "కలిసుండటమెందుకు" అనే టైటిల్ పెట్టె ఆలోచనలో ఉన్నారు. ఇందులో వెంకటేష్ అన్నగా నాగబాబు నటించనున్నాడు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించనున్నాడు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

0 comments:

Post a Comment