Tuesday 8 October 2013

రాబిన్‌హుడ్‌ టైపు పాత్రలో మహేష్ బాబు

రాబిన్‌హుడ్‌ టైపు  పాత్రలో  మహేష్ బాబు   హైదరాబాద్ : దూకుడులో పోలీస్ గా, బిజినెస్ మ్యాన్ లో డాన్ గా కనిపించిన మహేష్ బాబు...ఈ సారి రాబిన్ హుడ్ తరహా చారిత్రిక పాత్రలో కనిపించనున్నారు. గోన గన్నారెడ్డిగా ఆయన కనిపించి అలరించనున్నారు. గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘రుద్రమదేవి'. మన దేశంలోనే తొలి హిస్టారికల్ స్టీరియో ఫోనిక్ త్రీడీ చిత్రంగా‘రుద్రమదేవి' రూపొందుతోంది. టైటిల్ రోల్‌ని అనుష్క పోషిస్తున్నారు. ఇందులో కీలకపాత్రల్లో చాలా మంది హేమాహేమీలు నటిస్తున్నారు. తాజాగా ఫిలిమ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్న వార్త ఏంటంటే... ‘రుద్రమదేవి'లో మహేశ్‌బాబు గెస్ట్‌రోల్ చేయబోతున్నారు. ‘గోన గన్నారెడ్డి'గా ఆయన ఆ సినిమాలో నటించబోతున్నారని సమాచారం. కాకతీయ సామ్రాజ్య చరిత్రలో రుద్రమదేవికి ఎంత విశిష్ట స్థానం ఉందో, అంత ప్రత్యేకస్థానం గోనగన్నారెడ్డికి ఉంది. గోన గన్నారెడ్డి లేని కాకతీయ చరిత్రలో కీలకం. ఒక రాబిన్‌హుడ్‌లాంటి యాక్షన్ ఓరియెంటెడ్ పాత్ర అది. ఈ పాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ మహేశ్‌తోనే చేయించాలని గుణశేఖర్ సంకల్పించారు. ఈ పాత్రపై మహేశ్‌క్కూడా అవగాహన ఉంది. ‘అర్జున్' షూటింగ్ మధురమీనాక్షి సెట్‌లో జరుగుతున్నప్పుడు గుణశేఖర్ ఈ పాత్ర గురించి మహేశ్‌కి చెబితే ఉద్వేగానికి గురయ్యారట. ‘గోన గన్నారెడ్డి'గా మహేశ్ కోసం గుణశేఖర్ స్పెషల్ కాస్టూమ్స్ డిజైన్ చేయిస్తున్నారట. పూర్తి అధికారిక సమాచారం త్వరలోనే తెలుస్తుంది. ఇటీవలే అన్నపూర్ణ ఏడెకరాల్లో వేసిన భారీ సెట్‌లో ‘రుద్రమదేవి'కి సంబంధించి ఒక షెడ్యూలు పూర్తి చేశారు. అక్టోబర్ 1 నుంచి మరో షెడ్యూలు మొదలుకానుంది. ఈ చిత్రంలో అనుష్క టైటిల్‌రోల్‌ని పోషిస్తోంది. ఇటీవలే మూడో షెడ్యూల్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లో వేసిన పాకనాడు ప్రాంతం సెట్‌లో అనుష్క, యువరాజు చాళుక్య వీరభవూదుడిగా నటిస్తున్న రానాలపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. శతాబ్దపు వాతావరణాన్ని కళ్లకు కట్టినటుగ్లా ఆవిష్కరిస్తూ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్స్‌ను రూపొందించారు. అక్టోబర్ 1 నుంచి నాలుగో షెడ్యూల్ ఆరంభం కానుంది. భారీ నిర్మాణ వ్యయంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా ఈ చిత్రం మరో సంచలనానికి వేదిక కాబోతోంది. అగ్రహీరో మహేష్‌బాబు ‘రువూదమదేవి' చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించబోతున్నారని తెలిసింది. ఇందుకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, మహేష్ పాత్ర తాలూకు గెటప్ గురించి ఆయనకు వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రంలో శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, నాగదేవుడిగా బాబా సెహగల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, సినిమాటోక్షిగఫీ: అజయ్‌విన్సెంట్, ఆర్ట్: పద్మశ్రీ తోట తరణి, కాస్ట్యూమ్స్ డిజైనర్: నీతాలుల్లా, ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సిరి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.రామ్‌గోపాల్, కథ- స్క్రీన్‌ప్లే-నిర్మాత-దర్శకత్వం: గుణశేఖర్.

0 comments:

Post a Comment