ముంబై: క్రికెట్ లేకుండా సచిన్ టెండూల్కర్‌ను ఊహించేలేమని మాస్టర్
బ్లాస్టర్ సచిన్ టెండూల్క్రర్ సతీమణి అంజలి టెండూల్కర్ అన్నారు. సచిన్
టెండూల్కర్‌కు క్రికెట్ తప్ప మరో ప్రపంచం తెలియదని ఆమె అన్నారు. తనతో
సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే అంతర్జాతీయ టెస్టు క్రికెట్ నుంచి
తప్పుకోవాలని సచిన్ నిర్ణయించుకుిన్నట్లు తెలిపారు.
ఈ రోజు సచిన్ 24 ఏళ్ల
అంతర్జాతీయ క్రికెట్‌కు తెరపడుతోందని, ఇక ఇంట్లో వ్యవహారాలు పూర్తిగా
మారిపోతాయని ఆమె అన్నారు.
క్రికెట్ క్రీడను సచిన్ ఆరాధించాడని, ఇక క్రికెట్ ఆడకపోవడమనేది సచిన్‌కు
మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులందరికీ ఉద్వేగపూరితమైందని ఆమె శనివారంనాడు
మీడియాతో అన్నారు. సచిన్ లేకుండా క్రికెట్‌ను తాను ఊహించుకోగలనని, అయితే
క్రికెట్ లేకుండా సచిన్‌ను ఊహించుకోవడం కష్టమని అంజలి అన్నారు.
క్రికెట్ లేకుండా సచిన్‌ను ఊహించలేం: అంజలి
క్రికెట్ స్థానంలో సచిన్ జీవితంలో ఏది వస్తుందో చెప్పలేనని ఆమె అన్నారు.
ఉద్వేగాలను సచిన్ టెండూల్కర్ నిలువరించుకుంటాడని ఆమె చెప్పారు. ఉద్వేగాలను
దాచుకునే విషయంలో సచిన్ ముందుంటారని, ముఖంలో ఒత్తిడి ఛాయలు కనిపించవని,
ఇంట్లో కూడా ఉద్వేగాలను బయట పెట్టబోరని ఆమె అన్నారు.
తన కూతురు సారా కూడా సచిన్ లాగే వ్యవహరిస్తుందని, క్రికెట్‌కూ అభిమానులకు
తమ తండ్రి ఏమిటో ఇప్పుడు తమ పిల్లలకు అర్థమవుతోందని ఆమె చెప్పారు. వందశాతం
క్రికెట్‌కు ఇవ్వలేనప్పుడు తప్పుకోవడమే మంచిదని సచిన్ భావించారని, ఓ రోజు
తనకు చెప్పి నిర్ణయం తీసుకున్నాడని అంజలి చెప్పారు.
0 comments:
Post a Comment