Monday, 30 December 2013

పాలిటిక్స్‌లో పవనిజం... పెళ్లితో ఖతం...

 
పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ మరోసారి వార్తల్లోకి వచ్చారు.. గత కొంతకాలంగా సినిమాల హిట్స్‌ పరంగా, ఆ తర్వాత పవనిజం అనే కొత్త స్లోగన్‌తోనూ మీడియా నోళ్లలో నానుతున్న ఈ హీరో... ఇటీవలే రాజకీయనేత అవతారం ఎత్తనున్నాడని కూడా బాగా వినిపించింది. తెలుగుదేశం పార్టీలోకి రానున్నాడని మీడియా కధనాలు వెల్లడిరచాయి. అవన్నీ ఒకెత్తయితే... ఇప్పుడు మూడో పెళ్లితో పవన్‌ మరో సంచలనానికి కారణమయ్యారు.

అయితే విశేషం ఏమిటంటే గతంలో వచ్చిన కధనాలు ఒకదాని పునాది మీద ఒకటి పుట్టుకొస్తే... ఇప్పుడు వెల్లడైన నిజం... ఆ కధనాల్లో చాలా వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టేదిలా ఉండడం. ముఖ్యంగా పవన్‌ వరుస పెళ్లిళ్లు ఆయనకు మహిళల్లో ఉన్న ఫాలోయింగ్‌ను దెబ్బతీయనున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్వల్పవ్యవధిలోనే పెళ్లిళ్లు, విడాకులు అంటూ ఈ కొణిదల వారసుడు చెలరేగిపోవడం మరింతగా అతని ఇమేజ్‌కు మచ్చ తేనుందని అంటున్నారు.


ఈ నేపధ్యంలో... అసలే అంతంత మాత్రపు ఆశలతో రేపటి ఎన్నికలకు వెళుతున్న రాజకీయ పార్టీలు పవన్‌కళ్యాణ్‌ను రమ్మనడం మాట అటుంది అతను వస్తే పారిపోయే అవకాశం లేకపోలేదని పలువురు జోస్యం చెబుతున్నారు. అలాగే పవనిజం అంటూ వెర్రెత్తిపోతున్న అభిమాన సందోహానికి కూడా ఇదొక ఎదురుదెబ్బేనని, పవనిజం అంటే పూటకొకర్ని పెళ్లి చేసుకోవడమేనా అంటూ ఇతర హీరోల అభిమానులు, పవన్‌ ప్రత్యర్థులు ప్రచారం చేసే ప్రమాదం ఉంది కనుక... పెళ్లి అనే నిజం దెబ్బకు మిగతావన్నీ హాంఫట్‌ అయిపోవడం ఖాయమని తేల్చేస్తున్నారు. వీటన్నింటి నేపధ్యంలో తన పెళ్లి వార్తలపై పవన్‌ ఎలా స్పందిస్తారనేదానిపైనే రేపటి పవన్‌ భవిష్యత్తు అడుగు ఆధారపడి ఉందనేది నిర్వివాదం.

0 comments:

Post a Comment