చాలా కాలం నుంచి ఉన్నానంటే ఉన్నానన్నట్టు సినీరంగంలో అరకొర సినిమాలకే పరిమితమైపోయిన స్లిమ్‌గాళ్...శ్రియ... కాస్త తీరుబాటుగా ఉందనేమో... తన కెరీర్‌ను విశ్లేషించుకోవడం మొదలుపెట్టింది. అందులో భాగంగా... తాను చేసిన తప్పుల్ని నెమరేసుకుంది. హిట్ హీరోయిన్‌గా దూసుకుపోతున్నప్పుడు చేసిన ఐటమ్ సాంగ్స్ తనను దెబ్బతీశాయందీ భామ. అంతేకాదు ఎంతో ఆశపడి ‘పవిత్ర’లో చేసిన కాళ్‌గాళ్ పాత్ర తనకు ఏ మాత్రం ఉపయోగపడలేదని బాధగా చెప్పింది. బాలీవుడ్ హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్‌తో అదరగొట్టేస్తుంటే తనుకూడా అలా ట్రెండ్ తెద్దానుకున్నానని, బాలీవుడ్ హీరోయిన్లకు బ్రేక్ నిచ్చిన వేశ్యపాత్రను స్ఫూర్తిగా తీసుకుని పవిత్ర చేశానని చెప్తున్న శ్రియకు... ఇప్పటికైనా జ్ఞానోదయమయిందంటా... ‘ఎవరినో చూసి వాత పెట్టుకోకూడదని’.
0 comments:
Post a Comment