Monday 30 September 2013

పిల్లలజ్ఞాపకశక్తి, బ్రెయిన్ డెవలప్మెంట్ కు టాప్15 ఫుడ్స్

సాధారణంగా పిల్లలు ఎదిగే కొద్ది కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటుంటారు. లేదా తెలుసుకుంటుంటాడు. తరగతిలో కార్యకలాపాలు, స్టడీస్, స్పోర్ట్స్ మరియు ఇతర కొన్ని విషయాలు మీ పిల్లల తలలో భారంగా ఉంటాయి. ఆపైన అతను/ఆమె అన్ని రంగాలలోనూ ముందుడానికి ఇంట్లో వారు, తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. దాంతో పిల్లల మీద చాలా ఎక్కువగా ఒత్తిడి పెంచుతారు.
 చిన్న పిల్లలకు అది భారమనని తెలిసిన కొంత మంది తల్లిదండ్రులు వాటినేవి పట్టించుకోవాలి. తమ పిల్లల్లో ప్రెజర్ తగ్గించలేకపోతే వారి శక్తి సామర్థ్యాలు మరింత మెరుగుపడేందుకు సహాయపడే ఆరోగ్యకరమైన సరైన ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. కొన్ని పరిశోధనల ప్రకారం పిల్లల మెదడు అభివృద్ధి కోసం కొన్ని అద్భుతమైన ప్రముఖ ఆహారాల జాబితాను కనుగొన్నారు. 
ఈ ఆహారాలు పెరిగే పిల్లలకోసం చాలా ముఖ్యమైన మరియు అవసరమైన పోషకాలను అందించేందుకు సహాయపడుతాయి. పిల్లలు పెరిగే వయస్సులో తీసుకొనే ఆహారాలు వారి సంజ్ఞాత్మక నైపుణ్యాలు(cognitive skills )మరియు మెదడు అభివృద్ధి మీద ప్రభావితం చేస్తుంది. స్కూల్ కు వెళ్ళే పిల్లలకు బ్రేక్ ఫాస్ట్(ఉదయం తీసుకొనే అల్పాహారం)చాలా అవసరం.
 ఉదయం పిల్లలు తినేటటువంటి ఆహారంలో తగినన్ని ప్రోటీనులు మరియు క్లిష్టమైన పిండి పదార్థాలు ఉన్న ఆహారాలను అందివ్వడం ద్వారా రోజంతా పిల్లలకు అవసరం అయ్యే ఎనర్జీలెవల్స్ శరీరంలో పెంపొందించడానికి సహాయపడుతాయి. అంతే కాదు ఇవి ఇంకా పిల్లల్లో మోటార్ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. 
 కాబట్టి, మీ పిల్లలు తినడానికి ఎటువంటి ఆహారాన్ని అందిస్తున్నారు అన్న విషయాన్నిజాగ్రత్తగా గమనించాలి. ప్లేట్ నిండా ఎనర్జీలేని ఆహారాన్ని ఎంత పెట్టినా ప్రయోజనం ఉండదు. 
పూర్తి పోషకాంశలున్న కొద్దిపాటి ఆహారంలోనే అనేక ప్రయోజనాలుంటాయి. పిల్లలకు ఇష్టం లేని ఆరోగ్యకరమైన ఆహారాలను డైరెక్ట్ గా కాకుండి వాటిని వేరే ఇతర పదార్థాలను మిక్స్ చేసి ఇవ్వండి. ఇక్కడ మీ పిల్లల మెదడు అభివృద్ధి కోసం 10 అద్భుతమైన ఆహారాలు ఉన్నాయి:

గుడ్లు: 
విటమిన్ బి కాంప్లెక్స్ సముదాయములోని ఒక పదార్థము, గుడ్లులో ఉన్న ఐరన్, మరియు ఇతర విటమిన్స్ పిల్ల మెదడు ఆరోగ్యానికి మెమరీ మూల కణాల నిర్మాణానికి చాలా అవసరం అవుతుంది. మెదడులో ఎక్కువ కణాలు ఉన్నప్పుడు, మరింత మెరుగైన స్మృతి అలవడుతుంది. కాబట్టి, ప్రతి రోజూ పిల్లలకు ఇచ్చే అల్పాహారంలో గుడ్డును చేర్చుకోవాలి.


గ్రీక్ యోగర్ట్: 
పూర్తి కొవ్వు కలిగిన గ్రీక్ యోగర్ట్ మెదడు కణత్వచంను అనువైనదిగా ఉంచుతుంది. ఇవి మెదడులో కణాలు సమాచారం అతి త్వరగా పంపడం లేదా స్వీకరించడానికి బాగా సహాయపడుతుంది. గ్రీక్ యోగర్ట్ మీ పిల్లలు ఇష్టపడకపోతే అందులో కొన్ని రుచికరమైన చాక్లెట్ చిప్స్ ను జోడించండి.


ఓట్ మీల్: 
 ఓట్ మీల్ పెద్దలకు మాత్రమే కాదు, పెరిగే పిల్లలకు కూడా చాలా ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో పుష్కలమైనటువంటి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దాంతో తిన్న ఆహారం చాలా నిధానంగా జీర్ణం అవుతుంది. పెరుగుతున్న పిల్లలో ఒక స్థిరమైన శక్తి సామర్థ్యాలు పొందడానికి సహాయపడుతుంది.

చేపలు: 
ఎదిగే పిల్లల్లో జ్ఞాపకశక్తి క్షీణత మరియు మెమరీలాస్ జరగకుండా వ్యతిరేకంగా పనిచేసే విటమిన్ డి మరియు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ నేచురల్ ఫ్యాటీ ఫిషర్స్ లో పుష్కలంగా ఉండి మెదడును రక్షిస్తాయి. సార్డిన్స్, సాల్మన్ మరియు తున వంటి చేపల్లో ఇటువంటి మూలకాంశాలు ఎక్కువగా ఉంటాయి.


స్ట్రాబెర్రీస్: 
జూసీగా ఉండే ఇటువంటి ఫ్రూట్స్ లో యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఆహారాలు అభిజ్ఞాత్మక విధులు పెంచడానికి సహాయపడుతాయి . ఈ పండ్లలోని యాంటీఆక్సిడెంట్స్ మెదడు పనితీరుమీద దీర్ఘకాలిక ప్రభావాలు కలిగి ఉంటుంది.


పాలు: 
ఫ్యాట్ ఫ్రీ మిల్క్ లో ప్రోటీనులు, విటమిన్స్ డి మరియు ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. మీ పిల్లల్లో లాక్టోస్ లోపం లేకుంటా మిల్క్ టాప్ ఫుడ్ గా పిల్లలకు అంధివ్వవచ్చు .


పిల్ అండ్ ప్లమ్స్: 
 ఈ రెండు పండ్లు లంచ్ బాక్స్ ఫ్రెండ్లీ ఆహారాలుగా చెప్పవచ్చు ఎందుకంటే వీటిలో క్వర్సిటిన్, యాంటీఆక్సిడెంట్స్ జ్ఞాపకశక్తి క్షీణత పోరాడే గుణాలను పుష్కలంగా కలిగి ఉంటాయి.


నట్స్ :
 ఈ ప్రోటీన్ రిచ్ స్నాక్స్ అవసరమయ్యే ఫ్యాటీ యాసిడ్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. నట్స్ మెమరీ పెంచడానికి మరియు నెర్వస్ సిస్టమ్ ఆరోగ్యకరంగా ఉండటానికి బాగా సహాయపడుతాయి.


పసుపు: 
 ఈ ఇండియన్ మసాలా దినుసులో కుక్యుమిన్ అనే అంశం ఉండి మెదడు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. మరియు ఇది వాపు మరియు బ్లాక్లను అల్జీమర్ ఫలకం ఏర్పడటానికి పోరాడుతుంది.


మాంసాహారం: 
 పిల్లకు అందించే మాంసాహారం చాలా శుభ్రంగా ముఖ్యంగా తాజాగా ఉండేది అందివ్వాలి. ప్రొసెస్ చేసిన లేదా ప్యాక్ చేసి మాంసాహారాల కంటే తాజా మాంసాహారాన్ని వండి పిల్లలకు అందివ్వడం వల్ల పిల్లల్లో బ్రెయిన్ గ్రోత్ మరియు మెమరీ పెరుగుతుంది. మరియు ఎములక బలానికి పెరుగుదలకు కండరాల బలానికి బాగా సహాయపడుతాయి. వారికి కావల్సిన ఎనర్జీని అందిస్తుంది.


0 comments:

Post a Comment