Monday 30 September 2013

ఆఫీస్ పని ఒత్తిడిని జయించేందుకు కొన్ని సులువైన మార్గాలు..!

ఆఫీస్ పని ఒత్తిడిని జయించేందుకు కొన్ని సులువైన మార్గాలు..!

ఆఫీసు పని వలన దైనందిన జీవితంలో తామెంతో మానసిక వత్తిడికి గురవుతున్నామని ఉద్యోగాలు చేస్తున్న వారిలో సుమారు 50 శాతం మంది చెబుతుంటారు. ఆఫీసు పనిభారం వలన కలిగే ఈ మానసిక వత్తిడి కారణంగా కొంతమంది విధులకు హాజరు కాకుండా తప్పించుకుంటూ ఉంటారు. మరి కొంతమంది మద్యపానానికి బానిసలవుతున్నారు. 
ఉత్పాదన శక్తి గణనీయంగా పడిపోవడానికి ఈ రకమైన మానసిక వత్తిడి ఒక ప్రధాన కారణం.
 ఈ ఒత్తిడి వల్ల మానశికంగాను మరియు శారీరకంగాను ప్రభావం చూపుతుంది. ఒత్తిడి వల్ల వచ్చే కోపం, ఇరిటేషన్ వల్ల ఆ కోపాన్ని ఇతరులపై ప్రదర్శించడం వల్ల మనస్పర్ధాలకు చోటుచేసుకుంటాయి. అసలు మానసిక వత్తిడి అంటే? మనందరమూ కూడా మన విధుల నిర్వహ ణలో అనేక రకాలైన సమస్యలను, క్లిష్ట పరిస్థితులను, టార్గెట్స్, పోటీ ప్రపంచంలో సవాళ్ళ పెరగడం వంటి ఎన్నో బాధ్యతలను ఎదుర్కొంటూ ఉంటాము. అయితే వీటిలో చాలా వరకూ మనం సమర్థవంతంగా పరిష్కరించుకోగలిగేవే అయిఉంటాయి. అయితే ఈ రకమైన సమస్యలు, లేదా క్లిష్టపరిస్థితులు మనం పరిష్కరించుకోలేని స్థాయి దాటిపోయినప్పుడు, మానసికపరమైన, భావోద్రే కపరమైన, శారీరకమైన మార్పులు చోటు చేసుకో వడం మొదలవుతుంది. దీనిని మనం మానసిక వత్తిడి లేదా స్ట్రెస్‌ అని వ్యవహరిస్తాము. 
అయితే ఈ ఒత్తిడి ఒక్కో మనిషిలో ఒక్కోరకంగాఉంటుంది. ఈ రకమైన మానసిక వత్తిడిని మనందరమూ సాధారణంగా అప్పుడప్పుడూ అనుభవిస్తూనే ఉంటాము. అయితే ఇది కొన్నిసార్లు మనం ఊహించ లేని విపత్కర పరిణామాలకు దారి తీస్తుంది. అలా దారి తియ్యక ముందే ఒత్తిడిని తగ్గించుకోవడానికి పరిష్కారమార్గాలను కనుక్కోవాలి. అందుకు కొన్ని పరిష్కార మార్గాలు ఒక సారి పరిశీలించండి... మీరు ఒత్తిడిలో ఉన్నారని మీకు తెలుసు: మీ పని భారం ఎక్కువగా ఉందని భావించడం మరియు పని మీద నిరాశ, సవాళ్ళను ఎదుర్కోలేమోనన్న భయం, పని మీద ద్యాసలేకపోవడం, వంటివి ఒత్తిడికి సంకేతం.ఆఫీస్ పని ఒత్తిడిని జయించేందుకు కొన్ని సులువైన మార్గాలు..! ఒత్తిడికి సాధారణ సంకేతాలు డిప్రెషన్(నిరాశ), అనవసరమైన ఆందోళనలు, అలసట, ఏకాగ్రత కోల్పోవడం, ఆసక్తి లేకపోవటం, మరియు తలనొప్పి లేదా అధిక రక్తపోటు వంటి ఆరోగ్యసమస్యలే ఒత్తిడికి సాధారణ సంకేతాలు. శరీరంలో ఒత్తిడి ఏర్పడితే వెంటనే దానికి సంబంధించిన ర్యాడికల్సు శరీరంలో తయారు అయిపోతాయి. ఇవి ఎప్పటికప్పుడు శ రీరంలో నెగటివ్‌ పనుల్ని మొదలు పెడతాయి. ఇవి క్రమంగా నాడీ వ్యవస్థను ఇబ్బంది పెడతాయి. అందుచేత ఈ పరిస్థితి తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. ఆఫీస్ పని ఒత్తిడిని జయించేందుకు కొన్ని సులువైన మార్గాలు..! రోజు వారీ విశ్రాంతి: ఆహారం, పనులకు సమయం కేటాయిస్తుంటారు. కానీ, విశ్రాంతి గురించి పెద్దగా పట్టించుకోరు. దీని వలన శరీరం పగటి పూట పూర్తిగా పని చేయటం, రాత్రి పూర్తిగా నిద్రించటం అనే ట్రెండ్‌ సాగుతుంది. ఇది పూర్తిగా సరి కాదు. ఎందుచేతనంటే పని లో మెరుగైన ఫలితాలు రావాలన్నా, క్వాలిటీ పరంగా బెస్టుగా ఉండాలన్నా కొద్ది పాటి విరామం అవసరం. వీలుంటే మధ్యాహ్నం లంచ్‌ తర్వాత కొద్ది సేపు కనులు మూసుకొని విశ్రాంతి తీసుకోవటం ఒక పరి ష్కారం. లేదంటే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక కొద్ది సేపు విశ్రాంతి తీసు కోవాలి. దీని వలన ఆ తర్వాత నుంచి రాత్రి వరకు పనులన్నీ చక చకా సాగు తాయి. బ్రేక్‌ఫాస్టును మానవద్దు: చాలా మంది వర్కింగ్‌ విమెన్‌ బ్రేక్‌ ఫాస్టును పక్కన పెట్టేస్తారు. ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకొంటారు. శరీరానికి నిరంతరాయంగా శక్తి అందుతూ ఉండాలి. అప్పుడే సజావుగా అది తన పనులు తాను చేసుకో గలుగుతుంది. రాత్రి 8-9 గంటల సమయంలో భోజనం చేసి పడుకొంటే ఉదయం బ్రేక్‌ ఫాస్టు ను పక్కన పెట్టేస్తారు. లేదంటే ఆఫీసుకి వెళ్లాక 10-11 అయ్యాక అప్పుడు తింటారు. అంటే రోజులో 24 గంటలు ఉంటే అందులో సగం సేపు అంటే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9గంటల దాకా ఏమీ తీసు కోరు అన్నమాట. తర్వాత సగం సేపులోనే మొత్తం ఆహారాన్ని తీసుకొంటారు. దీని వలన జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. రోజు వారీ పనుల్ని ప్రణాళికా బద్దం: ప్రతీ రోజు చేసే పనులు అయినప్పటికీ వాటి కోసమే చాలా సేపు వెదకులాట సాగుతుంది. ఉదయం పూట టీ మగ్‌కనిపించ లేదనో, ఆఫీసుకి వెళ్లేప్పుడు ఫైల్స కనిపించ లేదనో వెదకులాట తప్పదు. అయితే పనుల్ని క్రమబద్దం చేసుకొంటే ఈ చికాకుల్ని తప్పించుకోవచ్చు. ఆరోగ్యకరమైన మనస్సు మరియు శరీరం: ఈ రెండు సాధ్యంకావలంటే ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయలి. మీ ఆరోగ్య పరిస్థితుల బట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. నికోటిన్(పొగత్రాగడం, కాఫి, టీలు)తగ్గించుకోవాలి. బాగా నిద్రపోవాలి. హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల మీరు ఏ విషయాన్నైనా పాజిటీవ్ గా తీసుకోగలరు. అంతే కాదు మీ మూడ్ పెంచడంతో పాటు మిమ్మల్ని చురుగ్గా శక్తి వంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. పనిచేసే ప్రదేశంలో అధిక ఒత్తిడికి గురిఅవుతున్నట్లైతే. అనవసరంగా ఆందోళన చెందనవసరం లేదు, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. సరైన ప్రతినధి మరియు నమ్మకం: మీ అనుచరులను మరియు మీ సబార్డినేటర్స్ యొక్క విధివిధాల మీద నమ్మకలిగి ఉండాలి. ఇది ఖచ్చితంగా వర్క్ ప్లేస్ లో మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. అదే సమయంలో మీరు మీ పనితీరును మెరుగు పరచడం కోసి మీ సమయాన్ని ఉపయోగించుకోగలుగుతారు. స్నేహపూర్వక వాతావరణం: మీ సహోద్యోగులతో మంచి సంబంధం కలిగి ఉండాలి మరియు వారిని గౌరవించాలి. ఇలా ఉన్నప్పుడు తప్పనిసరిగా మీలో, మీరు పనిచేసే ప్రదేశంలో తప్పనిసరిగా మార్పు తీసుకొస్తుంది. మీరు మీ సహోద్యోగులతో సౌకర్యవంతంగా ఉన్నప్పుడు మీ పని మీద మీరు ఏకాగ్రత, దృష్టి పెట్టవచ్చు. కమ్యూనికేషన్ పెంచుకోవాలి: మీ సహోద్యోగులతో పాటు మీ హైయ్యర్ అథారిటీస్(అధికారుల)తో కూడా మంచి సమర్థవంతమైన కమ్యూనికేషన్ కలిగి ఉండం చాలా మంచిది. ఇది చాలా ముఖ్యం కూడా. సరైన సమాచారం ఉండటం వల్ల మీరు మరింత సమర్థవంతంగా పనులు నిర్వహించడానికి అందరితో కలిసిమెలసి జీవించడానికి సహాయం చేస్తుంది. ఇది ఖచ్చితంగా మీ పని ప్రదేశంలో ఒత్తిడి తగ్గిస్తుంది. టైమ్ మ్యానేజ్ మెంట్: మీ సమయపాలను మీరు సమర్థవంతంగా పాటించగలిగినప్పుడు, మీ పని ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మీ పని భారాన్ని సులభంగా భావించి పని చేయడానికి నిర్ధారిస్తుంది.

0 comments:

Post a Comment