Monday 30 September 2013

వెనిగర్ యొక్క 19 అసాధారణ ఉపయోగాలు

సాదారణంగా మీ వంట గదిలో ఉన్న వెనిగర్ ను రుచికోసం కలిపే పదార్థంగా మాత్రమే ఉపయోగిస్తారు. ఇది వేల సంవత్సరాలుగా విలువైన బహుమతిగా ఉన్నది. వైన్,బీరు మరియు పళ్లరసం వంటి ఉత్పత్తులను కిణ్వ ప్రక్రియ ద్వారా పుల్లగా చేసే క్రమంలో యాదృచ్ఛికంగా వెనిగర్ కనుగొనబడింది. కానీ మీకు ఆ వెనిగర్ తెలుసా. ఇది ఖచ్చితమైనటువంటి డిస్టిల్డ్ వైట్ లిక్విడ్ మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ వివిధ వెరైటీల్లో దొరుకుతుంది. ఈ వెనిగర్ తో గృహసంబంధ, అందం, ఔషధ మరియు తోటల పెంపకం కొరకు వందల కొద్దీ ఉపయోగాలు ఉన్నాయి. ఇక్కడ వెనిగర్ తో 20 అసాధారణ ఎకోఫ్రెండ్లీ ఉపయోగాలు ఉన్నాయి. మీకు వాటి గురించి మీకు అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి, ఇక్కడ మేము మీకందిస్తున్న వెనిగర్ యొక్క ఉపయోగాలను తెలుసుకోండి.
హెయిర్ కండీషనర్
 ఒక కప్పు నీటిలో అర స్పూన్ వెనిగర్ కలిపి మీ జుట్టుకు పట్టిస్తే అది మీ జుట్టును బాగా శుభ్రం చేస్తుంది. నిజమే అప్పుడు మీ జుట్టు కాసేపు వాసన ఉండవచ్చు. కానీ మీకు ఎంతో ఉపయోగం కనపడుతుంది.
ముడతలు తొలగించును 
 మీరు బట్టలను ఐరన్ చేస్తున్నప్పుడు ముడతలు ఉంటె అప్పుడు దాని మీద వెనిగర్ మరియు నీటి ద్రావణంను స్ప్రే చేయాలి.

ఫ్లోర్ మరియు ఫ్రిజ్ క్లీనర్
 అర కప్పు వెనిగర్ ను అర కప్పు నీటిలో కలిపి ఫ్లోర్ (పాలరాయి లేదా గ్రానైట్),ఫ్రిజ్ మరియు మీ వంటగదిలో అల్మారాలను సులభంగా శుభ్రం చేయవచ్చు. ఇది సమర్థవంతంగా రిఫ్రిజిరేటర్ లో వచ్చే ఆహార పదార్దాల వాసనలను తొలగిస్తుంది.


మరకలను తొలగించుట  
దుస్తులపై చెమట మరకలు వదిలించుకోవటం కొరకు దుస్తులను ఉతికే ముందు దానిపై వెనిగర్ ను స్ప్రే చేస్తే ఆ మరక కనిపించదు.

 

బట్టలను సున్నితంగా చేస్తుంది 
మీరు దుస్తులను ఉతికేటప్పుడు మృదువుగా చేయటానికి తెల్లని వెనిగర్ ని ఉపయోగించండి. బట్టలు ఉతికినప్పుడు చివరి సమయంలో వెనిగర్ ను జోడించండి. ఇది సబ్బు అవశేషాలను కూడా తొలగిస్తుంది.


పువ్వులను తాజాగా ఉంచేందుకు 
కత్తిరించిన పువ్వులను ఫ్లవర్ వెజ్ లో పెట్టె ముందు ఆ నీటిలో అర స్పూన్ తెలుపు వెనిగర్ ను కలపాలి. అప్పుడు పువ్వులు తాజాగా ఉండడానికి సహాయపడుతుంది.

గుడ్లు గుడ్లు ఉడికించేటప్పుడు 
ఆ నీటిలో వెనిగర్ కలపండి. అలా చేయుట వలన తెల్ల సోన బయటకు రాకుండా అడ్డుకుని గట్టిగా ఉండేలా చేస్తుంది.


ఎక్కిళ్ళు నివారణ 
వైద్యుల నుంచి ఎటువంటి హామీ లేదు. కానీ వెనిగర్ ఎక్కిళ్ళు కొరకు ఒక చికిత్స సాధనంగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తికి నిరంతరంగా ఎక్కిళ్ళు వస్తుంటే ఆపడానికి ఒక స్పూన్ వెనిగర్ మ్రింగాలని చెప్పుతారు.


వాసన నిర్మూలనకు
  కొన్ని ఆహార పదార్దాలు మాడినప్పుడు ఆ వాసన పోవాలంటే ఒక గిన్నె నీటిలో మూడు వంతుల వెనిగర్ కలిపి ఆ గదిలో ఉంచితే వాసనను తొలగించవచ్చు. అంతేకాక ఆ వాసన చాలా త్వరగా పోతుంది.


కలుపు మొక్కల నిర్మూలన 
 విష పదార్ధాలను పూర్తిగా తొలగించి కలుపు మొక్కలను నిర్ములిస్తుంది. గృహసంబంధ వెనిగర్ నిజంగా అనవసరమైన మొక్కలను చంపుతుంది. 25% ఎసిటిక్ ఆమ్లంతో తయారు చేసిన శక్తివంతమైన వెనిగర్ తోటపని వినియోగం కొరకు ఉత్తమంగా పనిచేస్తుంది.


గొంతు నొప్పి నివారణ 
 గొంతు నొప్పి ఉపశమనానికి ఒక కప్పు వెచ్చని నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి నొట్లొ ఆ ద్రవము పోసుకొని పుక్కిలించాలి. దీనిని మరింత సమర్థవంతంగా మరియు చాలా రుచికరమైన చేయడానికి ఆ మిశ్రమానికి ఒక స్పూన్ తేనె ను కూడా కలపవచ్చు.


చీమల నిరోధం  
చిన్న చీమలు మీ ఇంటిలో నడిచే దారిలో ఇబ్బంది పెడుతున్నాయా? అయితే తెలుపు వెనిగర్ మరియు నీటిని ఒక 50/50 మిశ్రమంగా తయారు చేసి చీమలు ఉన్న చోట చల్లితే అవి బయటకు పోవటానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఈ ఇబ్బంది పెట్టే కీటకాలు వెనిగర్ యొక్క పెద్ద అభిమానులు కాదు.

కండరాల గాయాలు  
వ్యాయామం తర్వాత కండరాల గాయాల సంచితం కలిగించే భావన పోవటానికి ఆపిల్ సైడర్ వెనిగర్ లోని లాక్టిక్ ఆమ్లం సహాయపడుతుంది. ఒక కప్పు నీటిలో కొన్ని స్పూన్ల వెనిగర్ ను కలపాలి. ఆ మిశ్రమంలో ఒక వస్త్రాన్ని ముంచి ఆ ప్రాంతంలో 20 నిమిషాల పాటు వత్తాలి.

గాలిని తాజాగా ఉంచుట 
వెనిగర్ లో ఎసిటిక్ యాసిడ్ ఉండుట వల్ల గది చుట్టూ ఉన్న వాసనలను గ్రహిస్తుంది. కాబట్టి అది గదిలో వచ్చే వాసనను తటస్తం చేసి తాజాగా ఉంచుతుంది. గదిలో ఉపరితలాలు క్రింద తుడిచేందుకు దీన్ని ఉపయోగిస్తే తాజాగా ఉంటుంది.

స్టిక్కర్ తొలగించుటకు 
 తెలుపు వినెగార్ లో ముంచిన వస్త్రంను స్టవ్ పైన లేదా మైక్రోవేవ్ లో కొద్దిగా వేడి చేసి అప్పుడు స్టికర్ పై గట్టిగా నొక్కిపెట్టిన తర్వాత తీస్తే నెమ్మదిగా స్టిక్కర్ ఊడి వచ్చేస్తుంది. ఇదే ఉపాయంను అతికించిన వాల్ పేపర్ తీయటానికి కూడా ఉపయోగించవచ్చు.


మాంసంలో బాక్టీరియాను చంపడానికి 
ఆపిల్ సైడర్ వెనిగర్ లో రాత్రిపూట మాంసంను నానబెడితే మృదువుగా ఉంటుంది. అంతేకాక ఒక నివేదిక ప్రకారం ఆహారంలో అనారోగ్యం కలిగించే బాక్టీరియాను నాశనం చేస్తుందని తెలిసింది.


మురుగునీటి కాలువలలో వ్యర్థ పదార్థాలను తొలగించుట 
 మురికి లేకుండా ప్రవాహనికి అడ్డుపడి క్లియర్ చేస్తుంది. చెత్తను నిల్వచేసే స్థలము మరియు ప్రవాహంలో 3/4 కప్పు బేకింగ్ సోడా, 1/2 కప్ తెలుపు వినెగార్ తో కలిపి వేస్తె వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి.


ఫంగల్ అంటువ్యాధులకు చికిత్స 
పాదాలకు,కాలి గోరుకు వచ్చే ఫంగల్ అంటువ్యాధులు మరియు చుండ్రులకు ఖచ్చితంగా పనిచేస్తుంది. వైట్ వెనిగర్ మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ రెండింటినీ శరీరం యొక్క బాధిత ప్రాంతాల్లో ఫంగస్ చంపడానికి సమయోచితంగా ఉపయోగించవచ్చు.


ఆహారంలో మసాలా తటస్థీకరణ
  మీరు వండిన ఆహారంలో కారం,మసాల ఎక్కువైనప్పుడు మసాలాను తటస్తం చేయడానికి ఆ సమయంలో మీ ఆహారంలో ఒక స్పూన్ తెలుపు లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ ను జోడించండి.


త్రుప్పు తొలగించుట 
 వెనిగర్ లో ఎసిటిక్ ఆమ్లం ఉండుట వల్ల ఐరన్ ఆక్సైడ్ చర్య జరిగి మడత బందులు,నట్లు మరియు బోల్ట్స్ వంటి చిన్న మెటల్ వస్తువుల నుండి తుప్పును తొలగించడానికి సహాయపడుతుంది. అప్పుడు తదుపరి మెటల్ ను ప్రభావితం చేయకుండా వినెగార్ ను నిరోధించడానికి నీటితో బాగా శుభ్రం చేయాలి.




0 comments:

Post a Comment