Monday 30 September 2013

ఉల్లిపాయలోని ఆశ్చర్యకరమైన క్లీనింగ్ బెనిఫిట్స్
సాధరణంగా మన ఇంటిని శుభ్రం చేయడానికి వివిధ రకాల రసాయనాలు మరియు ఇతర నేచురల్ పద్దతులను ఉపయోగిస్తుంటాము. ముఖ్యంగా ఇంటిని శుభ్రం చేయడానికి ఎక్కువగా నిమ్మరసం మరియు బేకింగ్ సోడా వంటివి ఉపయోగిస్తుంటాం. అయితే ఉల్లిపాయ కూడా ఇంటి శుభ్రతకు ఉపయోగపడుతుందంటే ఆశ్చర్యం కలగకుండా ఉండదు. ఇంటి శుభ్రతకు కాకుండా వంటకాల్లో ఉపయోగించే వస్తువుగా మాత్రమే పరిమితం చేయబడ్డాయి. ఉల్లిపాయను వంటకాలకు లేదా బ్యూటీ ట్రీట్మెంట్స్ కు మాత్రమే ఉపయోగిస్తుంటాం. అయితే, ఉల్లిపాయను హౌస్ క్లీనింగ్ గా కూడా ఉపయోగించవచ్చని భావించాలి. మీ వంటగది మరియు ఇంటిని శుభ్రపరచడంలో ఇంట్లో దుర్గంధాన్ని తొలగించడానికి ఉల్లిపాయ బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయ నిర్మాణం మరియు వాటి సామర్థ్యం వల్ల చాలా శక్తివంతంగా శుభ్రం చేస్తుంది. ఉల్లిపాయను ఉపయోగించి ఇల్లును శుభ్రపరిచేందుకు కొన్ని మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం...

1.గ్రిల్స్ ను శుభ్రం చేయడానికి: ఇల్లలో విండో, డోర్ గ్రిల్స్ చాలా మురికి పట్టి ఉంటాయి. ఒక్కోసారి వాటిని శుభ్రం చేయడం కూడా కష్టతరం అవుతుంది. అటువంటప్పుడు ఉల్లిపాయ ముక్కతో గ్రిల్స్ మీద మొదట రుద్దాలి. దాంతో గ్రిల్స్ మీద పట్టిన దుమ్ము, దూళి, తుప్పు వంటివి శుభ్రంగా ఉల్లిపాయ ముక్కకు అంటుకొని వచ్చేస్తాయి.
 2. గ్యాస్ స్టౌ: ప్రతి ఒక్కరి ఇల్లలోనూ వంటగది శుభ్రత చాలా అవసరం. ముఖ్యంగా స్టౌ మీద ఎక్కువగా వండుతుంటారు. స్టౌ మరియు స్టౌ ఉంచే ప్రదేశంలో ఎంత శుభ్రంగా ఉంచినా కూడా తిరిగి అశుభ్రగా తయారవుతుంటాయి. కొన్ని నూనె, పాల మరకలకు పోగొట్టడం కష్టంగా మారుతుంది. అటువంటప్పుడు ఇటువంటి మరకలను తొలగించడానికి ఉల్లిపాయ బాగా సహాయపడుతుంది.
 3. ఎక్సాస్ట్ ఫ్యాన్ శుభ్రం చేయడానికి : ఎక్సాస్ట్ ఫ్యాన్స్ శుభ్రం చేయడం చాలా కష్టమైన పని. ఎక్సాస్ట్ ఫ్యాన్ యొక్క చిన్న చిన్న రంద్రాలు మరియు నెట్ ను శుభ్రం చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అటువంటప్పుడు దీన్ని శుభ్రం చేయడానికి ఉల్లిపాయ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఉల్లిపాయను సగం కట్ చేసి, బేకింగ్ సోడాలో డిప్ చేసి, తర్వాత ఎక్సాస్ట్ ఫ్యాన్ ను రుద్దాలి. ఘాటైన ఉల్లిపాయ రసం, బేకింగ్ సోడా రెండూ చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి. 
 
 4. విండ్ నెట్స్ శుభ్రం చేయడానికి: విండో నెట్స్ శుభ్రం చేయడం కష్టం. బ్రెష్ ను ఉపయోగించి కూడా శుభ్రం చేయలేం. పెద్దగా ఉన్న విండ్ నెట్స్ శుభ్రం చేయవచ్చు. కానీ చాలా చిన్న గా ఉన్న విండో నెట్స్ శుభ్ర చేయడానికి, దుమ్ము, ధూళి తొలగించడం కొంచెం కష్టం అవుతుంది. అటువంటప్పుడు విండో నెట్స్ కు విండో నెట్స్ మీద రబ్ చేయచ్చు. దాంతో నెట్స్ శుభ్రపడటమే కాదు, ఉల్లిపాయ వాసనకు క్రిమి కీటకాలు లోనికి రాకుండా అడ్డుకుంటుంది.
 5. మెటల్స్ ను ఫాలిష్ చేయడానికి: మెటల్స్, బ్రాస్ మరియు కాపర్ వంటి వస్తువు కొరకు ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకుంటాం. అవి ఎల్లప్పుడు మంచి షైనింగ్ తో ఉండాలని కోరుకుంటాం. బాగా మరకపట్టిన మెటల్స్ వస్తువులకు మంచి షైనింగ్ పొందడానికి ఉల్లిపాయతో మొదట రుద్ది, తర్వాత శుభ్రం చేయాలి.

0 comments:

Post a Comment