Saturday, 26 October 2013

హీరోయిన్ నయనతార గర్భవతి కాదట!

హైదరాబాద్: సౌతిండియా హాట్ హీరోయిన్ నయనతార బాలీవుడ్ మూవీ ‘కహానీ'కి రీమేక్ గా రూపొందుతున్న ‘అనామిక' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు/తమిళంలో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ఆమె ‘అనామిక' పాత్రలో కనిపించనుంది. ఎండర్ మోల్ ఇండియా, లాగ్ లైన్ ప్రొడక్షన్స్, సెలక్ట్ మీడియా హోల్డింగ్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కహానీ చిత్రం కోల్ కతా బ్యాక్ డ్రాప్‌తో సాగుతుంది.హీరోయిన్ నయనతార గర్భవతి కాదట! 
అయితే ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగిన విధంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. నయనతార    ఈ చిత్రానికి ప్రముక నావెలిస్ట్ యండమూరి వీరేంద్రనాధ్ ఈ చిత్రానికి సహాయ రచయితగా పని చేస్తున్నారు. విజయ్ సి. కుమార్ సినిమాగ్రఫీ చేయనున్నారు. సినిమా కథ విషయానికొస్తే... కనిపించకుండాపోయిన తన భర్త గురించి ఒక ఎన్ ఆర్ ఐ గర్భిణి చేసే అన్వేషణే ఈ కహానీ చిత్ర కథ. అనేక హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి‌తో చేసిన ఈ సినిమా హిందీలో ఘన విజయం సాధించడంతో తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈచిత్రంలో నయనతార గర్భవతిగా కనిపించదని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకే శేఖర్ కమ్ముల ఈ మార్పు చేసినట్లు సమాచారం. సినిమాలోని కొన్ని సీన్లలో నయనతారను దర్శకుడు గ్లామరస్‌గా చూపించాడని సమాచారం. కాగా....బాలీవుడ్ వెర్షన్ ‘కహానీ'కి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించగా, విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించింది.


0 comments:

Post a Comment