Thursday, 10 October 2013

‘రామయ్యా వస్తావయ్యా' లైవ్ అప్ డేట్స్

హైదరాబాద్ :ఎన్టీఆర్‌, సమంత జంటగా హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రం దశరా కానుకగా ఈ రోజు అంతటా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో యుఎస్ లో ఈ చిత్రం షో లు ఆల్రెడీ పడ్డాయి. ఎన్నారై పాఠకుడు రవి గారు ఈ చిత్రం లైవ్ అప్ డేట్స్ రివ్యూ రాసి పంపారు. అది యధాతథంగా...ప్రచురిస్తున్నాం. మన సైట్ లో వచ్చే రెగ్యులర్ రివ్యూ మరి కొద్ది గంటల్లో మీ ముందు ఉంటుంది.. ఈ లోగా ఈ రివ్యూని ఆస్వాదించండి...
‘రామయ్యా వస్తావయ్యా' లైవ్ అప్ డేట్స్
 * మెలోడి మ్యూజిత్ తో టైటిల్స్ ... సినిమా ప్రారంభం...ధియోటర్ లో విజిల్స్ ..హంగామా
 * పెళ్లి సీన్..ముఖేష్ రుషి, అజయ్ ఎంట్రన్స్ 
* సూపర్ గెటప్ తో (ఏంటనేది రివిల్ చేయటం లేదు) ఎన్టీఆర్ ఎంట్రీ... బ్యాడ్ హ్యాబిట్స్ అందరికీ ఉంటాయి..బ్యాంక్ బాలెన్స్ కొంతమందికే ఉంటుంది డైలాగు చెప్తూ...మంచి రెస్పాన్స్
 * ఫైట్ ....పందాలు గుర్రాల మీద వేసుకోవాలి, సింహాల మీద కాదు డైలాగు ‘రామయ్యా వస్తావయ్యా' లైవ్ అప్ డేట్స్ * పండగ చేస్కో పాట...ఎక్సలెంట్ కాస్టూమ్స్..స్టెప్స్.. ముఖ్యంగా లుంగీ డాన్స్ ఈ పాట లోనే...
 * ఎన్టీఆర్ కాలేజ్ స్టూడెంట్ లా ప్రెష్ గా ఎంట్రీ...సినిమా టెక్ గా ఇళయరాజా పాట బ్యాక్ గ్రౌండ్ లో సమంత ఎంట్రీ!!.. * సమంత, ఎన్టీఆర్ మధ్య కొన్నిు టీజింగ్ సీన్స్ , ప్రవీణ్ కామెడీ సెటైర్స్ పడుతున్నాయి. కూల్ కామెడీ
 * సీనియర్ నటి రోహిణి హట్టంగడి ..బేబి షామిలి గా ఎంట్రీ
 * ఎన్టీఆర్ ఫ్యామిలీ సీన్స్... సమంత వెనక పడటానికి ఓ పర్పస్ ఉంటుంది 
* ఎన్టీఆర్..సమంత ను ఇంప్రెస్ చేయటానికి టూ ఇంటల్ జెంట్ గా యాక్ట్ చేస్తూంటాడు. " ఐ డోంట్ నీడ్ టు యాక్ట్...ఐ యామ్ ఆల్రెడీ స్మార్ట్ " డైలాగు ఇక్కడే
 * ఓ లైలా సాంగ్..లొకేషన్స్ బాగున్నాయి. 
* గబ్బర్ సింగ్ శ్రీనివాస్ ...సూరిగా ఎంట్రీ... కామెడీ ఫైట్...‘ బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి... 'డైలాగు ఇక్కడే..
 * ఎన్టీఆర్ ..సమంతను ఫాలో అవుతూంటాడు
 * అంత్యాక్షరి బ్యాచ్ తో కామెడీ సీన్..
 * ఎన్టీఆర్ మాస్ డాన్స్
 * ఎన్టీఆర్ ..గుర్రం పై వచ్చే సీన్..
 * టెంపుల్ సీన్...సమంత, ఎన్టీఆర్, బామ్మ ... .ఎన్టీఆర్ ..సమంతకు హెల్ప్ చేస్తాడు...ఆమె పడిపోతుంది... మరో మంచి కామెడీ సీన్
 * కుర్ర ఈడు పాట...మంచి డాన్స్..సమంత మరింత గ్లామర్ గా కనిపించింది
 * కొన్ని ఎమోషనల్ సీన్స్
 * ఓ ఫైట్... ట్విస్ట్ తో కూడిన షాకింగ్ ఇంటర్వెల్... కూల్ గా డీసెంట్ గా ఫస్టాఫ్ ఉంది.. సెకండాఫ్ చూడాలనే ఆసక్తి కలిగేలా ఇంటర్వెల్ పడింది. సెకండాఫ్ ... 
* జాబిల్లి నువ్వే చెప్పమ్మా...సూపర్ కంపోజిషన్
 * కథ ఎవరూ ఊహించని విధంగా సాగుతోంది. థియోటర్ సైలెంట్ గా ఉంది 
 * రావు రమేష్ యాక్షన్ సీక్వెన్స్ తో ఎంట్రీ ...డైలాగ్స్ పీక్ లో ఉన్నాయి... 
* ఎన్టీఆర్ తరహా సినిమా మొదలైంది.
 * పెద్ద ట్విస్ట్ తో కూడిన ప్లాష్ బ్యాక్ మొదలు
 * శ్రుతి హాసన్ ..కూల్ ఎంట్రీ(ఫ్లాష్ బ్యాక్ లో )
 * ఎన్టీఆర్,శృతి హాసన్ సీన్స్ మొదలయ్యాయి.
 * వెంకటేష్ రాజా లోని యేదో ఒక రాగం పాట బీజీఎంతో కామెడీ సీన్ 
* ఎన్టీఆర్ ,శృతి హాసన్ మధ్య విలేజ్ సీన్స్...గుడ్ 
* ట్రైన్ లో ఫైట్ 
 * శారీలో శృతిహాసన్ చాలా అందంగా ఉంది. ఆమె మీద పేరడి నడుస్తోంది 
* రావు రమేష్ సీన్స్ హైలెట్.. ఆయన ది ఇంపార్టెంట్ రోల్(రివిల్ చేయటం లేదు) 
* నేనెప్పుడైనా సాంగ్...ఎక్సలెంట్ విజువల్స్
 * పొలిటీషియన్ గా రవి శంకర్ (మెయిన్ విలన్) ఎంట్రీ
 * అజయ్ మరికొంత మంది విలన్స్ గా వచ్చారు....హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్
 * హెవీ ఎమోషన్ సీన్... 
 * మరో ఫైట్...కోట శ్రీనివాస రావు గారు ఎంట్రీ 
* ఇది రణరంగం సాంగ్ ప్రారంభం...సూపర్ రెస్పాన్స్
 * క్లైమాక్స్ నడుస్తోంది...ఎమోషన్ సీన్స్ వస్తున్నాయి...టైటిల్ జస్టిఫై చేసారు...
 * సినిమా పూర్తైంది...సూపర్ హిట్ అంటూ అభిమానులు అంటూ బయిలుదేరుతున్నారు.
 సినిమాలో ఎన్టీఆర్ పేరు ..రామన్న చౌదరి. సమంత పేరు లైలా, శృతి హాసన్ పేరు అమ్ములు

0 comments:

Post a Comment