Thursday, 10 October 2013

ఫన్ యాక్షన్- విన్ రియాక్షన్ ( 'రామయ్యా వస్తావయ్యా ' ప్రివ్యూ)

హైదరాబాద్ : ఎన్టీఆర్‌, సమంత జంటగా నటించిన చిత్రం 'రామయ్యా వస్తావయ్యా ' ఈ రోజే(శుక్రవారం) విడుదల గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తయంగా అత్యథిక ప్రింట్స్ తో అవుతోంది. శ్రుతిహాసన్‌ ముఖ్య పాత్ర పోషిస్తోంది. 
ఫన్  యాక్షన్- విన్ రియాక్షన్  ( 'రామయ్యా వస్తావయ్యా '  ప్రివ్యూ)
హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించారు. గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత హరీష్ డైరక్ట్ చేస్తున్న చిత్రం కావటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి తమన్‌ అందించిన పాటలు, కట్‌ చేసిన ట్రైలర్‌ ఈ సినిమాపై పెట్టుకొన్న ఆశల్ని రెట్టింపు చేశాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ రామన్న చౌదరిగా కనిపిస్తారు. ఆయన కాలేజి స్టూడెంట్ గా ఫస్టాఫ్ లో ఫన్ తో సమంత ని టీజ్ చేస్తూ కథని నడిపి...ఆ కాలేజీ స్టూడెంట్ గా ఎందుకు రావాల్సి వచ్చిందనేది ఓ పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ తో చెప్పనున్నారు. శృతి హాసన్ ఆ ప్లాష్ బ్యాక్ లో కనపిస్తుంది. ఫస్టాఫ్ ఫన్ చేస్తే సెకండాఫ్ మొత్తం యాక్షన్ తో ఎమోషన్సో తో ఎన్టీఆర్ నుంచి అభిమానులు ఆశించే చిత్రంలా ఉంటుంది. ఫన్ యాక్షన్- విన్ రియాక్షన్ ( 'రామయ్యా వస్తావయ్యా ' ప్రివ్యూ) బృందావనంలో ఎన్టీఆర్‌ని సరికొత్తగా చూపించిన దిల్ రాజు ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌ని వైవిధ్యభరితమైన పాత్రలో ఆవిష్కరించబోతున్నారు. ఆయన అభిమానులు ఏం కోరుకొంటున్నారో అవన్నీ ఈ కథలో మేళవించామని చెప్తున్నారు. ఎన్టీఆర్‌, సమంతలపై తెరకెక్కించిన సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి అని హామీ ఇస్తున్నారు. దిల్ రాజు మాట్లాడుతూ... ''ఎన్టీఆర్‌ని ప్రేమికుడిగా దర్శకుడు హరీష్‌ శంకర్‌ తెరపై చక్కగా ఆవిష్కరించారు. సమంత, శ్రుతిహాసన్‌ అందాలు సినిమాకి ఆకర్షణగా నిలుస్తాయి. అన్నివర్గాల వారినీ అలరించే చిత్రమవుతుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకి మంచి స్పందన వస్తోంది. ఈ వారంలో సినిమాని విడుదల చేస్తాము. మీరు ఎన్ని అంచనాలు పెట్టుకొనైనా థియేటర్లకు రండి. సినిమా చూశాక అందరూ 'ఇది సూపర్‌హిట్‌' అంటారు. ఆ గ్యారెంటీ నాది.. '' అని అన్నారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ.... భీముడు పట్టాల్సిన గదని రాముడు పట్టాడంటే దాన్ని మీరు తెరమీద చూడాల్సిందే. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, క్లైమాక్స్‌కి తమన్‌ ఆర్‌.ఆర్‌.సూపర్‌గా ఇచ్చారు. ఇప్పటికే పాటలు హిట్‌ అయ్యాయి. ‘జాబిలి' సాంగ్‌ బ్లాక్‌ బస్టర్‌ అయింది. ఎన్టీఆర్‌ సింగిల్‌ టేక్‌లో ఏదైనా చేయగలడు. నాకు తెలిసి... డ్యాన్స్‌ని గానీ, డైలాగ్స్‌ని గానీ, యాక్షన్‌ సీన్స్‌ని గానీ సింగిల్‌ టేక్‌లో చేయగల హీరో ఎన్టీఆర్‌ తప్ప ఎవరూ లేరు. నటీనటులు : జూ.ఎన్టీఆర్, సమంత, శృతి హాసన్, రావు రమేష్, కోటశ్రీనివాసరావు, ముఖేష్‌ రుషి, తనికెళ్ల భరణి, ప్రగతి, అజయ్, భరత్, రవిశంకర్‌ తదితరులు ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, కణల్ కణ్ణన్, వెంకట్, నృత్యాలు : దినేష్, గణేష్, శేఖర్ బాను, పాటలు : సాహితి, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, శ్రీమణి, సంగీతం : థమన్, ఛాయాగ్రహణం: ఛోటా.కె.నాయుడు, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి, స్క్రీన్ ప్లే : రమేష్ రెడ్డి, సతీష్ వేగేశ్న, తోట ప్రసాద్, పోరాటాలు: కనల్‌ కణ్ణన్‌. సహ నిర్మాతలు : శిరీష్- లక్ష్మణ్, కథ, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్. నిర్మాత: దిల్‌ రాజు

0 comments:

Post a Comment