Wednesday, 9 October 2013

మల్లిక షెరావత్ నా కూతురులాంటిదన్న మహేష్ భట్

ముంబై: ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ ‘ది బ్యాచిలరెట్ ఇండియా-మేరే ఖాయాలోంకి మల్లికా' రియాల్టీ షోకు తొలి సెలబ్రిటీ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లికా షెరావత్‌కి పోటీ దారుల స్ర్కీనింగ్ విషయంలో హెల్ప్ చేస్తానని మాటిచ్చాడు. మల్లిక షెరావత్ నా కూతురులాంటిదన్న మహేష్ భట్ 
 తనకు తగిన జోడీని వెతకడం కోసమే బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ ‘ది బ్యాచిలరెట్ ఇండియా-మేరే ఖాయాలోంకి మల్లికా' అనే రియల్టీ షోను ప్రారంభించింది. మహేష్ భట్ నిర్మించిన ‘మర్డర్' చిత్రం ద్వారానే మల్లికా షెరావత్ బాలీవుడ్‌కి పరిచయమైన సంగతి తెలిసిందే. మల్లిక షెరావత్ నా కూతురులాంటిదన్న మహేష్ భట్ మల్లికా షెరావత్...తనకు సినీ జీవితాన్ని ఇచ్చిన మహేష్ భట్‌‌ను ఎంతో గౌరవిస్తుంది. ఆ గౌరవంతోనే ఆయన్ను తన షోకు తొలి సెలబ్రిటీ గెస్టుగా ఆహ్వానించింది. అంతే కాదు మహేష్ భట్ కూడా మల్లికను తన సొంత కూతురులా చూసుకుంటారట. ఆయన ఆశీస్సులతోనే మల్లికా షెరావత్ ఈ షోను ప్రారంభించిందట. ఇక షో వివరాల్లోకి వెళితే...ఇందులో మొత్తం 30 మంది పోటీ దారులు పాల్గొంటున్నారు. ఇంటర్నేషనల్ ఫార్మాట్లో ఈ షో సాగుతుంది. ఈ 30 మందిలో మల్లికను మెప్పించేది ఎవరు, వారు ఎలాంటి ప్రయత్నాలు చేసారు అనేది షోలో ఆసక్తికరం. ‘లైఫ్ ఓకే' చానల్‌లో ఈ షో ప్రసారం అవుతోంది

0 comments:

Post a Comment