హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు, రియల్ స్టార్ శ్రీహరి బుధవారం మృతి
చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది.
ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.
ప్రస్తుతం ఆయన వయసు 49. శ్రీహరి మృతితో తెలుగు చిత్ర సీమ దిగ్ర్భాంతికి
గురైంది.
ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాంబో రాజ్‌కుమార్ సినిమా షూటింగ్
నిమిత్తం ముంబై వెళ్లిన శ్రీహరి అక్కడ తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే
అతన్ని లీలావతి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మరణించారు.
ఆయనకు కాలేయ సంబంధ వ్యాధి ఉన్నట్లు సమాచారం. ఉన్నట్టుండి శ్రీహరి మరణ వార్త
అందరినీ షాక్‌కు గురి చేసింది.
స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీహరి...అంచెలంచెలుగా నటుడిగా
ఎదిగారు. 1989లో తమిళ సినిమా మా పిళ్ళై ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన
విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, నిర్మాతగా వివిధ రకాలుగా
రాణించారు. 28 చిత్రాల్లో హీరోగా నటించారు. రియల్ స్టార్‌గా ఖ్యాతి
గడించారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు వంద చిత్రాల్లో నటించారు.
జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర స్థాయి చాంపియన్ అయిన శ్రీహరి అథ్లెట్
అవ్వాలనుకున్నారు. జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనాల్సి
ఉన్నా....సినిమాలపై మక్కువతో ఈ రంగంవైపు అడుగులు వేసారు. దాసరి దర్శకత్వంలో
వచ్చిన ‘బ్రహ్మనాయుడు’లో ఆయనకు తెలుగు సినిమాలో నటుడిగా అవకాశం దక్కింది.
తాజ్ మహల్ చిత్రంలో పూర్తి స్థాయి విల్ పాత్రలో కనిపించారు.
2000వ సంవత్సరంలో వచ్చిన ‘పోలీస్' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు.
హీరోగా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా,
రెడీ, కింగ్, మగధీర, తుఫాన్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
2005లో ఉత్తమ సహాయ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు
అందుకున్నారు. శ్రీహరికి భార్య శాంతి ప్రియ, ఇద్దరు కుమారులు ఉన్నారు.
1964, ఆగస్టు 15న హైదరాబాద్‌లోని బాలానగర్లో జన్మించారు.






0 comments:
Post a Comment