Monday 28 October 2013

ఆశ్చర్య పరుస్తున్న అనుష్క భారీ కటౌట్ (ఫోటో)

హైదరాబాద్: తెలుగులో హీరోయిన్ అనుష్కకు ఉన్న ఫాలోయింగ్, స్టార్ స్టాటస్ ఏమిటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని పాపులారిటీ. ‘అరుంధతి' చిత్రం తర్వాత అనుష్క దశ తిరిగింది. తాజాగా బాహుబలి, రుద్రమదేవి లాంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోంది. వీరనారి పాత్రలకు అనుష్కకు ఎవరూ ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. అనుష్క వీరనారిగా నటించిన మరో చిత్రం ‘వర్ణ'. యుగానికి ఒక్కడు లాంటి హిట్ చిత్రాలకు తెరకెక్కించిన సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈచిత్రం ఆడియో ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన 70 అడుగుల భారీ కటౌట్ అందరినీ ఆకర్షించింది.

ఆశ్చర్య పరుస్తున్న అనుష్క భారీ కటౌట్ (ఫోటో) 
ఇప్పటి వరకు అక్కడ స్టార్ హీరోలకు కూడా అంతపెద్ద కటౌట్లు పెట్టిన దాఖలాలు లేవు. అనుష్క కటౌట్ ఇంత భారీగా ఏర్పాటు చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. సినిమాకు పబ్లిసిటీ పెంచడంలో భాగంగానే నిర్మాతలు ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేసినట్లు స్పష్టం అవుతోంది. వర్ణ చిత్రంలో ఆర్య, అనుష్క జంటగా నటించారు. ఈ చిత్రాన్ని పి.వి.పి. సినిమా పతాకంపై పరమ్‌ వి.పొట్లూరి నిర్మించారు. ఈ చిత్రాన్ని నవంబర్ 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేసిన ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కీలకమైనది. ఆ పాత్రకు అనుష్క ప్రాణం పోసింది. ఆమె పై వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ... ''జార్జియా దేశంలో తెరకెక్కించిన సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అక్కడ 18వ శతాబ్దంనాటి భవంతిలో చిత్రించిన దృశ్యాలు కీలకమైనవి'' అని తెలిపారు. గతంలో ‘అరుంధతి' చిత్రంలో కత్తి పట్టిన అనుష్క....వర్ణ చిత్రంలో కత్తి పోరాటాలు చేస్తూ సాహస యువతిగా కనిపించనుంది. ఈ పోస్టర్లు చూస్తుంటే సినిమా విభిన్నంగా, సరికొత్తగా ఉంటుందని స్పష్టం అవుతోంది. గతంలో ‘యుగానికి ఒక్కడు' లాంటి విభిన్నమైన సినిమాలు తెరకెక్కించిన సెల్వరాఘవన్ ఈ సినిమానే ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేసింది. ఒక పాత్రలో ఆమె సాధారణ గృహిణిగా, ఒక పాత్రలో ట్రైబల్ ఉమన్(ఆటవిక యువతి)గా కనిపించనుంది. జార్జియా అడవుల్లో అనుష్కపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో పోషిస్తోన్న విలక్షణమైన పాత్ర కోసమే అనుష్క మార్షల్ ఆర్ట్స్ ని సైతం నేర్చుకుంది. అరుంధతి తర్వాత అనుష్కకు ఈచిత్రం బాగా పేరు తెస్తుందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రామ్‌జీ, సంగీతం: హారిస్‌ జైరాజ్‌.

 

0 comments:

Post a Comment