Friday, 11 October 2013

ఒంటరిగానే, పవన్ హెల్ప్ లేదు..!(ఇంటర్వ్యూలో రేణుదేశాయ్)

హైదరాబాద్: బద్రి సినిమా ద్వారా ఒకరికొకరు పరిచయమైన పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ ఆ తర్వాత ప్రేమలో పడటం, సహజీవనం చేయడం, బిడ్డకు జన్మనివ్వడం, అనంతరం పెళ్లి చేసుకోవడం తెలిసిందే.
 ప్రస్తుతం రేణు దేశాయ్ నిర్మాతగా తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరాఠీలో ‘మంగలాష్ తక్ వన్స్ మోర్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రేణుదేశాయ్ నిర్మాతగా తన అనుభవాల గురించి, తన భర్త పవన్ కళ్యాన్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 
ఇంటర్వ్యూలోని ఆమె చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం....
 స్లైడ్ షోలో ఇంటర్వ్యూ వివరాలు....
 
 
పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ వైఫ్ నుంచి ఇండి పెడెంట్ నిర్మాతగా ఎలా మారారు? అనే ప్రశ్నకు రేణు దేశాయ్ స్పందిస్తూ.....‘ఈ మార్పు అనేది చాలా స్మూత్‌గా జరిగింది. పవన్ కళ్యాణ్ వల్ల సినిమా ఇండస్ట్రీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. స్క్రిప్టు, స్టోరీ, మ్యూజిక్ సిట్టింగ్స్‌తో ఫిల్మ్ మేకింగ్‌కు సంబంధించిన అన్ని విషయాల్లో ఇన్ వాల్వ్ అయ్యాను. ఇందుకు పవన్‌కు థాంక్స్ చెప్పాలి' అని చెప్పుకొచ్చారు.

 
 
 
ఆయన నా వెన్నంటే... మోడల్ గా కెరీర్ ప్రారంభించారు, నటిగా మారారు, ఇప్పుడు నిర్మాతగా....మీ జర్నీ ఎలా ఉంది? అనే ప్రశ్నకు రేణు దేశాయ్ స్పందిస్తూ...‘మనం ఎవరితోనైనా కలిసి పని చేని చేస్తే అది కాస్త డిఫరెంటుగా ఉంటుంది. వారు మనకు మార్గనిర్దేశం చేయవచ్చు. పవన్ చాలా పెద్ద వ్యక్తి. ఆయన నా వెనక ఉండి అన్ని పరిశీలిస్తారని తెలుసు. నా మార్గంలో నేను దారి తప్పితే ఆయన సరి చేస్తారని తెలుసు.

 
 
 
ఒంటరిగానే, పవన్ హెల్ప్ తీసుకోవడం లేదు కానీ నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నాక ఆయన హెల్ప్ లేకుండానే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. అడిగితే ఆయన అన్ని విధాలా అండగా ఉంటారు. కానీ నేను దీన్ని చాలెంజ్ గా తీసుకున్నాను. ఈ దారిలో ఒంటరిగా ప్రయాణించాలని డిసైడ్ అయ్యాను. స్క్రిప్టు ఎంచుకోవడం, ఆర్టిస్టులను కలవడం, మ్యూజిక్ డైరెక్టర్లను కలవడం, ఇలా అన్ని విషయాలు సొంతగా చూసుకుంటున్నాను. నా భార్య మిమ్మల్ని కలవడానికి వస్తుంది...అని పవన్ నన్ను రికమండ్ చేయడు' అని వెల్లడించారు.
 
 
 
పురుషాధిక్య సినిమా రంగమే, చాలెంజ్‌గా తీసుకున్నా సినిమా ఇండస్ట్రీ అంటేనే పురుషాధిక్య ప్రపంచం. ఇలాంటి పరిశ్రమలో మీకేమైనా చాలెంజ్ ఎదురైందా? అనే ప్రశ్నకు రేణుదేశాయ్ స్పందిస్తూ...‘సినిమా అంటేనే వ్యాపారం. ఏ రంగంలో అయినా పోటీ సహజమే. కొన్ని సవాళ్లను ఎదుర్కనాల్సి వస్తుంది. నేను పవన్ కళ్యాన్ వైఫ్‌ను కాబట్టి నాతో సినిమాలు చేయడానికి అంతా ముందుకు వస్తారని అనుకోవడం లేదు. పెద్ద పెద్ద యాక్టర్లు నా వ్యూ పాయింట్ ను అర్థం చేసుకుంటున్నారు. నేను సరైన దారిలోనే వెలుతున్నానని అనుకుంటున్నాను' అని వెల్లడించాు.

 
పిల్లల పెంపకంలో రాజీపడను తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూ...నిర్మాతగా కెరీర్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అనే ప్రశ్నకు రేణుదేశాయ్ స్పందిస్తూ ‘కెరీర్‌తో పిల్లల కోసం కూడా సమయం కేటాయించడం నా బాధ్యత. రోజులో కనీసం ఒకసారైనా వారితో కలిసి భోజనం చేస్తాను. తల్లిగా నా బాధ్యతలు నిర్వహించడంలో రాజీపడే ప్రసక్తే లేదు' అని వెల్లడించారు.



0 comments:

Post a Comment