Monday 28 October 2013

'శృంగార నిరాకరణ' ఉద్యమం... భర్తలతో శృంగారానికి నో...

ఎవరైనా తమ గ్రామంలో లేదా పట్టణంలో సమస్యలు వస్తే బంద్‌లు, రాస్తారోల ద్వారా నిరసనలు చేసి తమ డిమాండ్‌లను నేరవేర్చుకుంటారు. కానీ ఇంగ్లాండ్ మహిళలు మాత్రం తమ డిమాండ్‌లను పరిష్కరించుకునేందుకు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. అదే 'శృంగార నిరాకరణ ఉద్యమం'. అంటే తమ భర్తలతో శృంగారానికి దూరంగా ఉండడం.

ఇంగ్లాండ్‌లోని బార్బకావోస్, కొలంబియా ప్రాంతంలోని మహిళలు ఈ వినూత్న ఉద్యమాన్ని చేపట్టారు. తమ ప్రాంతంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లకు మరమ్మత్తు చేయాలన్నది వారి డిమాండ్. అప్పటివరకు తమ భాగస్వాములతో శృంగారానికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.


బార్బకావోస్ నుంచి సమీప ఆస్పత్రికి వెళ్లాలంటే 14 గంటలు పడుతుందని, గర్భిణిలు ప్రసవం సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలను ఏకరవు పెడుతున్నారు. మార్గ మధ్యంలోనే చాలా మంది అనారోగ్యంతో మరణించారని వెల్లడించారు. వారి సమస్యలపై అధికారులు స్పందించాల్సివుంది.

ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన తమ దేశంలోనూ ఇలాంటి దయనీయ పరిస్థితులున్నాయని ఇంగ్లండ్ వనితలు 'శృంగార నిరాకరణ' ఉద్యమం ద్వారా అందరి దృష్టికీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాగా గత రెండేళ్ల నుంచి ఇలాంటి ఉద్యమం చేయడమిది రెండోసారి.

0 comments:

Post a Comment